గవర్నర్‌కు మోడీ ఫోన్, విద్యుత్ ఉత్పత్తి ఆపిన తెలంగాణ

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ఉదయం ఫోన్ చేశారు. ఈ రోజు నరసింహన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా మోడీ ఫోన్ చేసి ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావులు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

బెంగళూరుకు బాబు

చంద్రబాబు నాయుడు మంగళవారం ఉదయం బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. బెంగళూరులో జరిగే పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మొదట న్యూట్రానిక్స్‌ కార్యాలయం ప్రారంభోత్సవానికి సీఎం హాజరుకానున్నారు. అనంతరం సిస్‌కో కంపెనీని సందర్శించనున్నారు.

ఈ సందర్భంగా సిస్‌కో ఉద్యోగులతో జరిగే సమావేశంలో ఏపీ విజన్‌ అంశంపై చంద్రబాబు ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం కోస్లా ల్యాబ్‌ను పరిశీలించిన అనంతరం కర్నాటక ముఖ్యమంత్రితో బాబు భేటీ కానున్నారు.

ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాలకు సంబంధించిన పలు ముఖ్యాంశాలపై వారు చర్చించనున్నారు. అనంతరం వ్యవసాయరంగ నిపుణులతో చంద్రబాబు సమావేశమై చర్చించనున్నారు. సాయంత్రం ఐటి, పారిశ్రామిక రంగాలను ఆకట్టుకునేందుకు జరిగే ఏపీ రోడ్‌షోలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.

 Narendra Modi phone to Narasimhan

ఢిల్లీ చేరుకున్న ఏపీ మంత్రి దేవినేని

శ్రీశైలం జల వివాదానికి సంబంధించి కేంద్రం ముందు ఏపీ ప్రభుత్వం తన వాదనను వినిపించనుంది. ఈ అంశంపై కేంద్రంతో చర్చించేందుకు మంగళవారం ఉదయం భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, ఇంజనీరింగ్‌ చీప్‌ ఎమ్ వెంకటేశ్వరరావు ఢిల్లీ చేరుకున్నారు. మరికాసేపట్లో కేంద్ర మంత్రి ఉమాభారతితో మంత్రి దేవినేని ఉమా, అధికారులు సమావేశం కానున్నారు. శ్రీశైలం జలాల వినియోగం, విద్యుత్‌ ఉత్పత్తిపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

శ్రీశైలంలో విద్యుదుత్పత్తి నిలిపివేత

శ్రీశైలం లెఫ్ట్ పవర్ హౌస్‌లో ఈ రోజు విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దానిని తాత్కాలికంగా నిలిపివేసింది. తెలంగాణ జెన్కో ఈరోజు 25 నిమిషాల పాటు విద్యుత్తును ఉత్పత్తి చేసింది. ఉత్పత్తిని నిలిపివేయడం వెనుక ఎవరి ప్రమేయం కాని, ఒత్తిడి కాని లేదని ప్రస్తుతం విద్యుత్‌కు డిమాండ్ తక్కువగా ఉందని, అందుకే ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. మళ్లీ అవసరమైనప్పుడు ఉత్పత్తిని పున:ప్రారంభిస్తామని వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+