నారాయణ సంచలన వ్యాఖ్యలు: 'మోడీ.... భార్యను ఇంటికి తెచ్చుకో'

హైదరాబాద్: సంచలన వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచే సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మతోన్మాదంపై విమర్శలు గుప్పిస్తున్న క్రమంలో ఆయన ప్రధాని నరేంద్రమోడీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

ఘర్ కీ వాపసీలో భాగంగా "మోడీ.... భార్యను ఇంటికి తెచ్చుకో" అంటూ నారాయణ డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణుల కోపానికి గురయ్యాయి. సోమవారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన సందర్భంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తోన్న ప్రజావ్యతిరేక విధానాలతో దేశ సమైక్యతకు భంగం కలుగుతోందని మండిపడ్డారు.

Narendra modi took her wife to his home says cpi Narayana

సంఘ్ పరివార్ నేతలు హిందుత్వాన్ని రెచ్చగొడుతున్నారని విమర్శించారు. సెక్యులరిజం, సోషలిజం పదాలను తొలగించాలని వ్యాఖ్యలు చేసిన బీజేపీ మంత్రులను వారి పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఘర్ కీ వాపసీ కొత్తగా వచ్చినది కాదని చెబుతున్న బీజేపీ... అలా అయితే మోడీ తన భార్యను ఇంటికి తెచ్చుకోవాలని అన్నారు.

ఒబామా పర్యటన కార్పొరేట్ సంస్థలకే తప్ప దేశ ప్రజలకు ఎలాంటి లాభం లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సమర్థవంతమైన పాలన కావాలని కోరుకుంటున్నారే తప్ప అందమైన భవనాలు కావాలని కోరుకోవడం లేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నారాయణ డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+