వివాహేతర సంబంధం: ప్రియుడి చేతులు నరికిన భర్త

విజయనగరం: తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ధనుంజయ్‌ అనే వ్యక్తిని పథకం ప్రకారం గ్రామ శివార్లలోకి తీసుకెళ్ళి చేతులు నరికేసిన దారుణ ఘటన విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం కొత్తగూడలో చోటు చేసుకొంది.

విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం కొత్తగూడ గ్రామానికి చెందిన ఓ వివాహితతో అదే గ్రామానికి చెందిన నరేష్ అనే వ్యక్తి భార్యతో ధనుంజయ్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం నరేష్‌కు తెలిసింది. దీంతో తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకొన్న వ్యక్తిపై కక్ష తీర్చుకోవాలని నరేష్ భావించాడు.

Naresh cuts hands of Dhanjay for illegal affair in Vijayanagaram

అయితే ఈ విషయమై నరేష్ మరో ముగ్గురు స్నేహితుల సహయం కోరాడు. పథకం ప్రకారంగా తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ధనుంజయ్‌ను గ్రామ పొలిమేరకు తీసుకొచ్చారు. తమ వెంట తెచ్చుకొన్న కత్తులతో నరేష్ దనుంజయ్ చేతులను నరికేశాడు. దీంతో అతడు అక్కడే పడిపోయాడు.

అయితే అటుగా వస్తున్న స్థానికులు బాధితుడు ధనుంజయ్ ను ఆసుపత్రికి తరలించారు. స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత విశాఖపట్నంలోని కింగ్ జార్జి ఆసుపత్రికి తరలించారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+