పవన్ కల్యాణ్ సభలో జాతీయ జెండాకు అవమానం: ఇలా తిరిగేసి...

అనంతపురం: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అనంతపురం జిల్లా పర్యటనలో జాతీయ పతాకకు అవమానం జరిగింది. ధర్మవరంలో చేనేత కార్మికుల సమస్యలు తెలుసుకుని ఆన హిందూపురం వెళ్లారు.

హిందూపురంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘనంగా ఆయనకు స్వాగతం పలికారు. జనసేన జెండాలతో పాటు త్రివర్ణ పతాకాన్ని కూడా ఎగురేసారు. అయితే, జాతీయ జెండాను కర్రకు తిరిగేసి కట్టారు. దీంతో పవన్ కల్యాణ్ అభిమానులపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.

పవన్ కల్యాణ్ ముఖాముఖి

పవన్ కల్యాణ్ ముఖాముఖి

పవన్ కల్యాణ్ మూడు రోజుల అనంతపురం జిల్లా పర్యటన చేశారు. శనివారంనాడు అనంతపుర పట్ణణంలో రైతులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. రైతులు తమ సమస్యలను పవన్ కల్యాణ్ దృష్టికి తెచ్చారు. రైతులు చెప్పిన సమస్యలను ఆయన నోట్ చేసుకున్నారు.

పరిటాల సునీత ఇంటికి...

పరిటాల సునీత ఇంటికి...


ఆదివారం రాత్రి పవన్ కల్యాణ్ మంత్రి పరిటాల సునీత ఇంటికి వెళ్లి ఆమెతో సాగునీటి ప్రాజెక్టులపై చర్చించారు. ఆ తర్వాత కదిరి నరసింహస్వామిని దర్శించుకున్నారు. కదిరిలో శాసనసభ్యుడు చాంద్ పాషాతో సమావేశమయ్యారు.

తర్వాత సత్యసాయి ఆశ్రమానికి..

తర్వాత సత్యసాయి ఆశ్రమానికి..

ఆ తర్వాత పుట్టపుర్తి వెళ్లారు. పుట్టపర్తి సత్యసాయిబాబా ఆశ్రమాన్ని దర్సించారు. అనంతపురం జిల్లాలో నీటి వసతుల కల్పనకు సత్యసాయిబాబా చేసిన కృషిని ఆయన ప్రశంసించారు.

ధర్మవరంలో చేనేత కార్మికులతో...

ధర్మవరంలో చేనేత కార్మికులతో...


సోమవారంనాడు ధర్మవరంలో చేనేత కార్మికుల సమస్యలను పవన్ కల్యాణ్ అడిగి తెలుసుకున్నారు. ధర్మవరం చేనేత కార్మికుల సమావేశంలో ఓ అభిమాని పవన్ కల్యాణ్‌కు అజ్ఞాతవాసి చిత్రంతో రూపొందించిన పట్టువస్త్రాన్ని బహూకరించారు.ఆ వస్త్రాన్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ దాన్ని ప్రశంసించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+