ఆ శవానికి ఆర్నెల్ల తర్వాత పోస్టుమార్టం... ఎందుకంటే?
చిత్తూరు : చిత్తూరు జిల్లాలో ఒక నేర ఘటనకు సంబంధించి విచిత్రం చోటుచేసుకుంది. 6 నెలల క్రితం అంగళ్లు గ్రామ వాసి శెట్టి సీతారాంరెడ్డి చనిపోగా ఆయన గుండెపోటుతో మృతిచెంది నట్టు భావించిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఆ తరువాత వేరే హత్య కేసుకు సంబంధించి పోలీసులు హంతకులను పట్టుకొనగా వారు పలు హత్యలు చేశారని, అందులో శెట్టి సీతారాంరెడ్డి మర్డర్ కూడా ఒకటని తెలిసింది.
దీంతో అవాక్కైన పోలీసులు శెట్టి సీతారాంరెడ్డి మృతదేహాన్నివెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు. శరీర భాగాలను తిరుపతిలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపుతున్నట్లు ఇన్‌చార్జి రూరల్ సీఐ సురేష్‌కుమార్ వెల్లడించారు. అయితే ఆర్నెళ్ల తర్వాత కూడా శెట్టి సీతారాంరెడ్డి మృత దేహం చెక్కుచెదరకుండా ఉండడం విశేషం. ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ తాలుకూ నివేదిక మంగళవారం రానుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...మదనపల్లెలో ఇటీవల జరిగిన హత్య కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు కొంతమంది నిందితులను అరెస్టు చేశారు. విచారణలో వారు సీతారాంరెడ్డిని కూడా హత్య చేసినట్టు అంగీకరించారు. ఆస్తి పంపకాలకు అడ్డుపడుతున్నాడన్న కారణంతో అతన్ని బంధువులు పథకం ప్రకారం హత్య చేయించినట్టు వెల్లడించారు. ఊరి బయటకు వాకింగ్‌కు వెళ్లిన ఆయనకు బలవంతంగా విషపు నీరు తాగించడంతో చనిపోయినట్లు వివరించారు.
పోలీసులు తహసీల్దార్ ఆధ్వర్యంలో గురువారం సీతారాంరెడ్డి మృతదేహాన్నివెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. ఆయన శరీర భాగాలను తిరుపతి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఐదుగురు నిందితులపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి మంగళవారం నివేదిక అందిన తర్వాత దర్యాప్తు వేగవంతం చేస్తామన్నారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications