NBK Vs PSPK : బాలయ్య -పవన్ షో స్ట్రీమింగ్ ముహూర్తం ఫిక్స్: ఇక అన్ స్టాపబుల్..!!

నందమూరి-మెగా అభిమానులు నిరీక్షిస్తున్న బాలయ్య - పవన్ కల్యాణ్ అన్ స్టాపబుల్ షో స్ట్రీమింగ్ ముహూర్తం ఖరారైంది.

NBK Vs PSPK Unstoppable 2 with NBK: నందమూరి - మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. అభిమానులు ఆసక్తిగా నిరీక్షిస్తున్న బాలయ్య - పవన్ కల్యాణ్ అన్ స్టాపబుల్ షో స్ట్రీమింగ్ ముహూర్తం ఖరారైంది. ఆహా ఓటీటీ వేదిక గా ఈ షో ప్రారంభం నుంచి భారీ అంచనాలు కనిపిస్తున్నాయి. షో ప్రారంభానికి ముందే ఇద్దరు హీరోల అభిమానుల్లో ఆసక్తి కనిపించింది. షో షూటింగ్ రోజున అన్నపూర్ణ స్టూడియో వద్ద హంగామా నెలకొంది. ఇక, ఈ షో కు సంబంధించి ఇప్పటికే రెండు ప్రోమోలు విడుదలయ్యాయి. ఒక దాని మించి మరో దానికి ఆదరణ పెరిగింది. అందులో బాలయ్య - పవన్ కాంబో పైన మరింత ఆసక్తి పెంచింది. సినీ - పొలిటికల్ - పర్సనల్ లైఫ్ గురించి పవన్ చెప్పిన అంశాలు.. పవన్ గురించి విమర్శలు చేసే వారికి బాలయ్య మార్క్ మాస్ వార్నింగ్ ఈ షో కు హైలైట్ కానున్నాయి.

బాలయ్య ప్రశ్నలు.. పవన్ ఆన్సర్స్

బాలయ్య ప్రశ్నలు.. పవన్ ఆన్సర్స్


నందమూరి బాలకృష్ణ హోస్టుగా ఆహా వేదిక పైన పవన్ కల్యాణ్ తో షూటింగ్ పూర్తి చేసిన టాక్ షో ఇక అభిమానుల ముందుకు రానుంది. ఈ షో లో బాలయ్య పలు ఆసక్తికర ప్రశ్నలకు పవన్ నుంచి సమాధానం రాబట్టారు. ఇప్పటిక విడుదలైన ప్రోమోలో పవన్ కు ఇంత పాపులారిటీ ఉన్నా.. ఓట్లు ఎందుకు రాలేదనే ప్రశ్నకు సమాధానం తెలుసుకున్నట్లు స్పష్టం అవుతోంది. అదే విధంగా రెండు సీట్లలో ఓడినా.. ఎక్కడా వెనకడుగు వేయకుండా రాజకీయంగా చేస్తున్న పోరాటం పైన మరిన్ని ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. టీడీపీ పైన పవన్ అభిప్రాయం.. పొత్తుల వ్యవహారాలపైన బాలయ్య ప్రశ్నించారని తెలుస్తోంది. తాను కోరుకున్నట్లుగా టీడీపీ ఉంటే తాను పార్టీ పెట్టాల్సిన అవసరం ఏంటని ఒక ప్రశ్నకు సమాధానంగా పవన్ చెప్పినట్లు సమాచారం. తాజాగా టీడీపీ జనసేన పొత్తు ఖాయమని భావిస్తున్న వేళ ఈ ఎపిసోడ్ రాజకీయంగానూ ఆసక్తిని పెంచుతోంది.

వ్యక్తిగత జీవితంపై పవన్ ఓపెన్ గా..

వ్యక్తిగత జీవితంపై పవన్ ఓపెన్ గా..


ఈ షో లో పవన్ వ్యక్తిగత జీవితం గురించి బాలయ్య ప్రశ్నలు సంధించారు. వైసీపీ నేతలు పదేపదే పవన్ వివాహాల గురించి ప్రశ్నిస్తున్నారు. దీని పైన బాలయ్య తన షో లో నేరుగా పవన్ ను ప్రశ్నించారు. పవన్ కూడా తన వివాహాల గురించి చాలా ఓపెన్ గా సమాధానం చెప్పారని తెలుతోంది. దీంతో..ఇక నుంచి ఎవరైనా పవన్ వ్యక్తిగత అంశాల గురించి ప్రశ్నిస్తే..చెప్పుతో కొడతానంటూ హెచ్చరించారు. అదే సమయంలో పవన్ కుమారుడు అకీరా గురించి బాలయ్య ప్రశ్నించారు. బాలయ్య కుమారుడు పవన్ కు పూల బొకే ఇచ్చి ముచ్చటించారు. ఈ షోలో పవన్ తో పాటుగా డైరెక్టర్లు త్రివిక్రమ్, క్రిష్ మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సందడి చేసారు. రాం చరణ్ ఫోన్ ద్వారా మాట్లాడినట్లు చెబుతున్నారు. ఇక.. రాజకీయంగానూ పవన్ తన లక్ష్యం ఏంటనేది క్లారిటీ ఇచ్చారని తెలుస్తోంది.

బాలయ్య - పవన్ కాంబో షో స్ట్రీమింగ్ ఎప్పడంటే


ఇప్పటికే రెండు ప్రోమోలు వచ్చిన ఈ షో ఫిబ్రవరి 3న స్ట్రీమింగ్ కు నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం బాలయ్య చేస్తున్న అన్ స్టాపబుల్ 2 సీజన్ కూడా ఈ షో తో ముగించినున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ షోకు సంబంధించి భారీగా ఫ్యాన్స్ నిరీక్షిస్తున్నారు. చంద్రబాబుతో ప్రారంభించిన సీజన్ 2 పవన్ తో ముగించనున్నారు. ప్రోమోల ద్వారా భారీ హైప్ క్రియేట్ కావటంతో ఈ షో ఖచ్చితంగా కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. మరి...ఆహీ ఈ ఇద్దరి షో స్ట్రీమింగ్ పైన అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+