సాయిరెడ్డి స్థానంలో రాజ్యసభకు కూటమి అభ్యర్ధి ఫిక్స్..!!
ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి పై బీజేపీ పట్టు బిగిస్తోంది. భాగస్వామ్య పార్టీగా ఉంటూనే బలం పెంచుకోవటం పై వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఏపీలో కూటమి అధికా రంలోకి వచ్చిన తరువాత ఒక రాజ్యసభ.. ఒక ఎమ్మెల్సీ సీటు దక్కించుకున్న బీజేపీ.. ఇప్పుడు మరో రాజ్యసభ స్థానం పైన కన్నేసింది. వైసీపీలో కీలకంగా వ్యవహరించిన సాయిరెడ్డి రాజీనామా తో ఏపీ నుంచి రాజ్యసభ స్థానం ఖాళీ అయింది. ఈ సీటు కోసం టీడీపీ - బీజేపీ నుంచి ఆశావాహులు రేసులో ఉన్నారు. కాగా, ఈ సీటు ఎవరికి దక్కుతుందనేది దాదాపు స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది.
మారుతున్న సమీకరణాలు
కూటమిలో ఆసక్తి కర లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. తాజాగా ఎమ్మెల్సీ సీట్ల ఖరారులోనూ బీజేపీ వ్యూహాత్మకంగా చివరి నిమిషంలో ఒక సీటు దక్కించుకుంది. రాజ్యసభ స్థానాల విషయం లో బీజేపీ కొత్త లెక్కలు తెర మీదకు తెస్తోంది. ఏపీలో కొద్ది నెలల క్రితం మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయితే.. తొలుత మూడు పార్టీలకు ఒక్కొక్కటి చొప్పున తీసుకోవాలని భావించినా.. చివరకు టీడీపీ నుంచి వచ్చిన అభ్యర్ధనతో పవన్ తన సోదరుడు సీటును త్యాగం చేసారు. ఫలితంగా టీడీపీ రెండు.. బీజేపీ కి ఒక సీటు దక్కాయి. ఇప్పుడు విజయ సాయిరెడ్డి రాజీనామాతో మరో రాజ్యసభ సీటు కూటమికి దక్కనుంది. అయితే, ఈ సీటు మూడు పార్టీల్లో ఎవరికి వారు తమకే అనే అంచనా తో ఉన్నారు. కానీ, సాయిరెడ్డి ఖాళీ చేసిన స్థానం బీజేపీకి దక్కనుంది.

బీజేపీ కొత్త లెక్కలు
ఇప్పటికే ఢిల్లీ బీజేపీ నాయకత్వం చంద్రబాబు, పవన్ కు స్పష్టం చేసి నట్లు సమాచారం. సామాజి క సమీకరణాల ఆధారంగా రాజ్యసభకు అభ్యర్ధులను ఎంపిక చేయాల్సి వస్తోంది. వైసీపీ నుంచి ముగ్గురు బీసీ రాజ్యసభ ఎంపీలు కూటమిలో చేరారు. తిరిగి మూడు సీట్లలో రెండు బీసీ వర్గాలకే కేటాయించారు. కొత్త అభ్యర్ధి జూన్ 2028 వరకు ఎంపీగా కొనసాగే అవకాశం ఉంటుంది. సాయిరెడ్డి స్థానం రాయలసీమకు చెందిన రెడ్డి వర్గానికి కేటాయించాలని తొలుత భావించారు. ఈ క్రమంలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరు తెర మీదకు వచ్చింది. ఇప్పుడు అనూహ్యంగా బీజేపీ అధి నాయకత్వం మరో పేరు వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ వాయిస్ జాతీయ స్థాయి లో బలంగా వినిపించే జీవీఎల్ నరసింహారావు పేరు ఫైనల్ అవుతుందని ప్రచారం సాగుతోంది.
బీజేపీ అభ్యర్దిగా..!
జీవీఎల్ నరసింహారావు గతంలో యూపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. 2024 ఎన్నికల్లో కూటమి అభ్యర్దిగా విశాఖ నుంచి పోటీ చేసేందుకు చివరి వరకు ప్రయత్నించారు. కాగా, టీడీపీ విశాఖ సీటు ఇవ్వటానికి నిరాకరించింది. ఫలితంగా అనకాపల్లి సీటు దక్కగా.. అక్కడ నుంచి సీఎం రమేశ్ పోటీ చేసి గెలుపొందారు. ఇప్పుడు జీవీఎల్ కు రాజ్యసభ సీటు ఇవ్వాలని పార్టీ అధి నాయకత్వం భావిస్తున్నట్లు ఢిల్లీ బీజేపీ ముఖ్య నేతల సమాచారం. కిరణ్ కుమార్ రెడ్డి ఈ పదవి కోసం ఇప్పటికే సీఎం చంద్రబాబుతో పాటుగా బీజేపీ ముఖ్య నేతలతోనూ సంప్రదింపులు చేసారు. కాగా, ఈ సీటు బీజేపీకే వెళ్లుందని టీడీపీ నేతలు సైతం చెబుతున్నారు. ఇక.. జీవీఎల్ తో పాటుగా మరో ఇద్దరు నేతలు సైతం రాజ్యసభ కోసం పోటీ పడుతున్నారు. దీంతో.. చివరి నిమిషంలో అనూహ్య మార్పులు జరిగితే మినహా.. ఈ సీటు బీజేపీకి దక్కటం ఖాయంగా కనిపిస్తోంది.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications