శుభవార్త: ఎంపీల నిరసనలతో దిగొచ్చిన కేంద్రం, లోటు భర్తీకి సిద్దం
Recommended Video

అమరావతి: ఎట్టకేలకు కేంద్రం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేస్తామని కేంద్రం ప్రకటించింది. కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, పీయూష్ గోయల్‌లతో కేంద్ర మంత్రి సుజనా చౌదరి చేసిన చర్చలు ఫలించాయి.
ఏపీ డిమాండ్లపై కేంద్రం నుండి సానుకూలంగా స్పందించింది. ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక ప్యాకేజీని యధాతథంగా ఇవ్వాలని కేంద్రం అంగీకరించింది. విశాఖకు రైల్వేజోన్ ను ఇచ్చేందుకు కేంద్రం కూడ సానుకూలంగా స్పందించిందని సమాచారం.
కేంద్ర బడ్జెట్‌లో ఏపీ రాష్ట్రానికి సరైన నిదులు లేవనే విషయమై కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకుగాను టిడిపి ఎంపీలతో పాటు ఏపీ రాష్ట్రానికి చెందిన ఇతర పార్టీల ఎంపీలు కూడ పార్లమెంట్ ఉభయ సభల్లో కూడ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అయితే రాజ్యసభలో మూడోసారి కూడ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి జైట్లీ ప్రకటన పట్ల కూడ టిడిపి ఎంపీలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
అయితే రాజ్యసభ వాయిదా పడిన తర్వాత పార్లమెంట్ ఆవరణలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, పీయూషీ గోయల్‌లతో సుదీర్ఘంగా చర్చించారు. ఏపీ డిమాండ్లపై కేంద్రం నుండి సానుకూలంగా స్పందించింది. దీనిపై కేంద్రం ఏ మేరకు ఈ విషయమై వీటిని అమలు చేస్తోందనే విషయమై ఆచరణలో తేలనుంది.

ఏపీ డిమాండ్లపై కేంద్రం సానుకూల స్పందన
రాజ్యసభ వాయిదా పడిన తర్వాత కేంద్రం నుండి ఏపీ రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయమై బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, పీయూష్ గోయల్ తో టిడిపి ఎంపీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి సుదీర్ఘంగా చర్చించారు. ఏపీ ప్రభుత్వం కోరుతున్న అంశాలపై కేంద్ర మంత్రుల వద్ద సుజనా ప్రతిపాదనలను ముందు పెట్టారు. ఈ విషయమై మంత్రులు అధికారులతో చర్చించారు. ఏపీ ప్రభుత్వం డిమాండ్ల విషయమై సానుకూలంగా స్పందించారు. ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజీని ఇస్తామని కేంద్రం హమీ ఇచ్చింది.ఈ హమీ మేరకు ప్రత్యేక ప్యాకేజీని యదాతథంగా అమలు చేసేందుకు అంగీకారం కుదిరింది. ఒప్పందం మేరకు నిధులు విడుదల చేస్తామని కేంద్ర మంత్రులు హమీ ఇచ్చారని టిడిపి ఎంపీలు చెబుతున్నారు.

రైల్వేజోన్‌పై త్వరలో ప్రకటన
విశాఖకు రైల్వే జోన్ ను ఇవ్వాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. టెక్నికల్ అంశాలను సాకుగా చూపి విశాఖకు రైల్వే జోన్ ఇవ్వాలని టిడిపి డిమాండ్ చేస్తోంది. అయితే విశాఖకు రైల్వేజోన్‌ను కేటాయించేందుకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు త్వరలోనే ప్రకటన చేసే అవకాశం ఉందని టిడిపి ఎంపీలు చెబుతున్నారు.

కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అంగీకారం
కేంద్ర ప్రభుత్వం కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అంగీకరించింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిర్ణీత కాలంలో పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను విడుదల చేస్తామని కేంద్రం ప్రకటించింది.

ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రెవిన్యూలోటు పూడ్చివేత
రాష్ట్ర రెవెన్యూ లోటు భర్తీకి కేంద్రం సానుకూల సంకేతాలు ఇచ్చింది. 2014-15 సంవత్సరానికి గాను 14వ ఆర్థికసంఘం నిబంధనల ప్రకారం 10 నెలల కాలానికి రాష్ట్రానికి రావాల్సిన మొత్తం వెంటనే ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు మూడేళ్లకు సంబంధించిన మొత్తాన్ని కూడా ఒకేసారి విడుదల చేసేందుకు అంగీకరించినట్లు సమాచారం.దురగరాజుపురం పోర్టు నిర్మాణం విషయంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి.ఇక్కడ పోర్ట్ నిర్మాణాన్ని ఇస్రో వ్యతిరేకిస్తోంది.దీంతో మరో చోట పోర్టు నిర్మాణం కోసం కేంద్రం సానుకూలంగా స్పందించింది. అయితే ఎక్కడ పోర్టు నిర్మించాలనే విషయమై స్థలాన్ని చూపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం కోరింది.
-
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications