ఏపీ ఎగ్జిట్ పోల్స్ లో బిగ్ ట్విస్ట్ - అక్కడే "అధికారం" ఫిక్స్..!!
ఏపీలో ఫలితాల పై ఉత్కంఠ పెరుగుతోంది. ప్రధాన పార్టీలు గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నాయి. సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటనకు సిద్దం అవుతున్నాయి. జూన్ 4న ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ సమయంలోనే పార్టీల నేతలు తమ అంచనాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి హోరా హోరీగా ఎన్నికల సమరం లో ఫలితం పైన అదే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సమయంలోనే ఆసక్తి కర లెక్కలు తెర మీదకు వస్తున్నాయి.
పార్టీలకు క్లారిటీ
ఏపీలో ఎన్నికల ఫలితాల పై పార్టీలకు క్లారిటీ వచ్చింది. ఎలాగైనా బయట పడకపోతామా అనే తుది లెక్కల్లో నిమగ్నమయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ వెల్లడించేందుకు సర్వే సంస్థలు సిద్దమయ్యాయి. ఈ సారి ఎన్నికల సమరం సాగిన విధంగానే ఫలితంలోనూ నువ్వా నేనా అన్నట్లుగా ఉంటుందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, ఈ సారి ఫలితాలను అంచనా వేయటం సర్వే సంస్థల సమర్ధతకు పరీక్షగా మారుతున్నాయి. ఏపీతో పాటుగా జాతీయ సంస్థలు రాష్ట్రంలో శాంపిల్స్ సేకరించాయి. ఫలితం పైన ఒక అంచనాకు వచ్చాయి. జూన్ 1వ తేదీ సాయంత్రం తమ అంచనాలను వెల్లడించనున్నాయి.

భారీ అంచనాలు
టీడీపీ కూటమి, వైసీపీ గెలిచే స్థానాల పైన ఆ పార్టీలకు స్పష్టత వచ్చింది. కానీ, హోరా హోరీగా ఎన్నికలు జరిగిన నియోజకవర్గాల్లో ఫలితమే ఇప్పుడు అధికారానికి దగ్గర చేయనుంది. ఎవరికి వారు తమకు అనుకూలంగా ఉందని చెబుతున్నా...క్షేత్ర స్థాయి నివేదికలు మాత్రం ఏకపక్షంగా లేవని తెలుస్తోంది. రాష్ట్రంలో దాదాపు 33 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కీన్ కంటెస్ట్ ఉంది. వీటిలో ఎవరు మెజార్టీ సీట్లు సాధిస్తే వారికి అధికారం దగ్గరయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ నియోజకవర్గాల్లో రెండు వైపులా బలమైన అభ్యర్దులు బరిలో ఉన్నారు. ఇక్కడ సామాజిక సమీకరణాలు కీలకంగా పని చేసాయి. కానీ, అంతిమ ఫలితం పైన మాత్రం సర్వే సంస్థలకు అంతు చిక్కటం లేదు.
తుది ఫలితం పై ఉత్కంఠ
సీఎం జగన్ 2019 కంటే ఎక్కువ సీట్లలో విజయం సాధిస్తామని చెప్పుకొచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలతో వైసీపీకి 45 సీట్లు కూడా రావని ధీమా వ్యక్తం చేసారు. పలు సర్వే సంస్థలు ఏపీలో ఓటరు పల్స్ పైన స్పష్టతతో లేవని తెలుస్తోంది. ఈ సారి సర్వే సంస్థలు వెల్లడించే అంచనాలు..వాస్తవ ఫలితాలు ఎంత వరకు దగ్గర ఉంటాయనేది సందేహంగానే కనిపిస్తోంది. హోరా హోరీ పోరు జరిగిన స్థానాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో చివరి రౌండ్ వరకు ఉత్కంఠ తప్పేలా లేదు. తుది ఫలితం ఎవరి సీట్ల సంఖ్య పెరుగుతుందనేది అధికారం డిసైడ్ చేయటంలో కీలకం కానుంది. దీంతో..ఎగ్జిట్ పోల్స్ తో పాటుగా వాస్తవ ఫలితాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications