హైదరాబాదీలకు పండుగలాంటి వార్త.. ట్రాఫిక్ ఫ్రీ సిటీ కోసం ఈ రూట్లలో నయా ప్లాన్!

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతుంది. వాహనాల సంఖ్య పెరిగి ప్రస్తుతం 18 లక్షలకు పైగా వాహనాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తిరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో మరింత రద్దీ పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితులలో నగరంలో ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం చేయడానికి హైదరాబాద్ అర్బన్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ కొత్త ప్రణాళికను సిద్ధం చేసింది.

HUMTA ఆధ్వర్యంలో సరికొత్త కారిడార్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్

గ్రేటర్ హైదరాబాద్ లో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా హుమ్టా HUMTA ఆధ్వర్యంలో సరికొత్త కారిడార్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ ను సిద్ధం చేసింది. నగరంలో అత్యధిక ట్రాఫిక్ రద్దీ ఉండే మూడు కీలక మార్గాలను పైలెట్ ప్రాజెక్టు కింద మొదటి విడతలో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.

hyderabad new corridor improvement plan pilot project in three routes for traffic free hyderabad

మూడు మార్గాల్లో పైలెట్ ప్రాజెక్ట్

మియాపూర్ నుండి గండి మైసమ్మ మార్గం, ఓవైసీ హాస్పిటల్ నుండి తార్నాక మార్గం, పేరడైజ్ జంక్షన్ నుండి అసెంబ్లీ మార్గంలలో పైలెట్ ప్రాజెక్టులను మొదటి విడతలో అభివృద్ధి చేసి రిజల్ట్ చూడనుంది. ఇందులో భాగంగా చాలా చోట్ల ఫుట్ పాత్ ల పైన వ్యాపారాలు చేయడం, ఇతర నిర్మాణాలతో ఆక్రమణలు చేయడం కనిపిస్తుంది. ఫుట్ పాత్ లను ఆక్రమించడం వల్ల అనేక ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి.

ఆక్రమణల తొలగింపు, వాహనాలకు ప్రత్యేక లైన్లు

అందుకే ఈ ఆక్రమణలను తొలగించాలని నిర్ణయించారు. అంతేకాదు రోడ్లపైన నడిచే వాళ్ల కోసం, సైకిళ్ల కోసం ప్రత్యేక మార్గాలను ఏర్పాటుచేసి వాటిని పాదచారులు సైకిల్ రైడర్స్ యూజ్ చేసుకునేలా చూడనున్నారు. ఆ మార్గాలలోకి ఇతర వాహనాలను అనుమతించరు. మరోవైపు బైక్లు, ఆర్టీసీ బస్సులు, కార్లు వేర్వేరుగా లైన్ మార్కులు వేస్తారు. ఏ వాహనానికి కేటాయించిన లైన్లో ఆ వాహనదారులు వెళ్లాల్సి ఉంటుంది.

16 జిల్లాల్లో లోటు వర్షాలతో సాగు సంక్షోభం..అన్నదాతకు గండం!
16 జిల్లాల్లో లోటు వర్షాలతో సాగు సంక్షోభం..అన్నదాతకు గండం!

పైలెట్ ప్రాజెక్ట్స్ సక్సెస్ అయితే ఫ్యూచర్లో అనేక రూట్లలో

ప్రధాన కూడళ్ళ వద్ద జంక్షన్ లను రీ డిజైన్ చేయడంతో పాటు వాహనాలు సాఫీగా వెళ్లడానికి వీలుగా యూటర్న్ సెంట్రల్ మీడియన్ అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. ఈ నిర్ణయం ద్వారా ఈ ప్రాంతాలలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ ఏవిధంగా జరుగుతుందన్నది స్టడీ చేయనున్నారు. ఈ పైలెట్ ప్రాజెక్ట్స్ సక్సెస్ అయితే ఫ్యూచర్లో అనేక రూట్లలో దీనిని ఇంప్లిమెంట్ చేయడానికి ప్లాన్ చేసే అవకాశం ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+