సంగీత విద్వాంసుడు నేదునూరి కృష్ణమూర్తి అస్తమయం

విశాఖపట్నం: ప్రముఖ సంగీత విద్వాంసుడు నేదునూరి కృష్ణమూర్తి (87) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. అన్నమయ్య కీర్తనలకు వన్నెలద్దిన నేదునూరి కృష్ణమూర్తి ఇక లేరు. ఏడాదికిపైగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన విశాఖపట్నం ఎంవీపీ కాలనీలోని తన స్వగృహంలో ఆదివారం అర్ధరాత్రి దాటాక 1.40 గంటలకు తు దిశ్వాస విడిచారు. ఆయన భార్య సుగుణ పదేళ్ల కిందట చనిపోయారు. నేదునూరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారంతా ప్రస్తుతం విశాఖలోనే ఉంటున్నారు.

పలువురు ప్రముఖులు నేదునూరి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ప్రభుత్వం తరపున మంత్రి సీహెచ్‌ అయ్యన్నపాత్రుడు, ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు నేదునూరి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. శాసన మండలి చైర్మన్‌ ఎ.చక్రపాణి, వైస్‌ చైర్మన్‌ సతీష్‌రెడ్డి, ఎమ్మెల్యే గణబాబు, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ తదితరులు నివాళులు అర్పించారు. నేదునూరి అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహించింది.

nedunuri Krishnamurthy passes away

కర్ణాటక సంగీతాన్ని సుసంపన్నం చేసిన నేదునూరి కృష్ణమూర్తి తెలుగు వాడు కావడం తెలుగు ప్రజలకు గర్వకారణమని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. నేదునూరి మృతిపట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు. ఆయన అనారోగ్యంగా ఉన్న సమయంలో పరామర్శించడానికి చంద్రబాబు తన తరఫున పరకాల ప్రభాకర్‌ను పంపారు.ఐదు వారాల కిందటే నేదునూరి కృష్ణమూర్తి తన స్వస్థలమైన పిఠాపురం వచ్చారు.

నేదునూరి కృష్ణమూర్తి పేరిట విశాఖలో స్మారక మ్యూజియం ఏర్పాటు చేయనున్నట్టు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ తెలిపారు. కర్ణాటక సంగీతంలో ఆయన అధిరోహించిన శిఖరాలను ప్రతి ఒక్కరికి పరిచయం చేయడంతోపాటు భావితరాలకు నేదునూరి గురించి తెలియజెప్పడానికి ‘నేదునూరి మెమోరియల్‌ డిజిటల్‌ ఆర్కైవ్స్‌ లైబ్రరీ ఆఫ్‌ కర్ణాటక మ్యూజిక్‌'ను ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే అక్టోబర్‌ పదో తేదీ ఆయన జయంతి నాటికి దీన్ని సిద్ధం చేస్తామన్నారు.

చెన్నైకి చెందిన ప్రముఖ సంగీత విద్వాంసులు పప్పు వేణుగోపాలరావు ఐదు వేల గంటల నిడివి గల డిజిటల్‌ కర్ణాటక సంగీత గీతికలను ఈ స్మారక లైబ్రరీకి అందించడానికి అంగీకరించారని యార్లగడ్డ తెలిపారు. నేదునూరి మృతికి తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు రమణాచారి సంతా పం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+