Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నన్ను రెండుసార్లు అవమానించాలని చూశారు..

రాపూరు మండలంలో ఇప్పటివరకు పెత్తనం చెలాయించిన చెన్ను కుటుంబాన్ని తాను దగ్గరకు తీయబోవడంలేదని నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లాలో రోజుకో పరిణామం చోటుచేసుకుంటోంది. వెంకటగిరి నియోజకవర్గానికి సమన్వయకర్తగా నియమితులైన మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మరోసారి హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పెంచలకోన ఆలయానికి వెళ్లిన తనను అవమానించాలని చూశారని, కానీ తాను రెండుసార్లు పెంచలకోన దేవాలయానికి వెళ్లగా.. రెండుసార్లు దేవుడు రెండు పదవులు ఇచ్చాడన్నారు. రాపూరు మండలంలో ఇప్పటివరకు పెత్తనం చెలాయించిన చెన్ను కుటుంబాన్ని తాను దగ్గరకు తీయబోవడంలేదని ప్రకటించారు.

ఆనం రామనారాయణరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రాపూరు మండలంలో చెన్ను కుటుంబానికి మాత్రమే పదవులు కేటాయించారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు మంత్రి పదవి రాలేదనే అక్కసుతో పార్టీని వీడుతున్నారని మండిపడ్డారు. జగన్ దయతలిచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా కృతజ్ఞత లేకుండా పోయిందని ధ్వజమెత్తారు.

nedurumalli ramkumar reddy fire on anam ramanarayana reddy

ఒకవైపు ఆనం రామనారాయణరెడ్డి, మరోవైపు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. మధ్యలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలతో నెల్లూరు జిల్లా వైసీపీలో కలకలం రేకెత్తింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేస్తానని కోటంరెడ్డి ప్రకటించారు. తన ఫోన్ ట్యాప్ చేశారని ప్రకటించగా, ఆనం తనది కూడా చేశారన్నారు. దీనిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టత ఇచ్చారు. నెల్లూరు వైసీపీలో ఉన్న విభేదాలు కూడా బయటపడ్డాయని, బయటపడని నాయకులు ఇంకా చాలామంది ఉన్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా రోజరోజుకు నెల్లూరు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికలు సమీపించే సమయానికి ఈ విభేదాలు పార్టీకి నష్టం కలిగించని విధంగా చూసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపైనే ఉంటుందంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+