ఏపీ కొత్త సీఎస్‌గా నీలం సహానీ?: విజయ్ చందర్‌కు ఏపీ సర్కారు కీలక పదవి

అమరావతి: టాలీవుడ్ సీనియర్ నటుడు టీ విజయ్ చందర్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక పదవిని కట్టబెట్టింది. రాష్ట్ర చలన చత్ర, టీవీ, నాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సీనియర్ నటుడు

సీనియర్ నటుడు

ఈ ఉత్తర్వులు తక్షణమే వర్తిస్తాయని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ వెల్లడించింది. కాగా, విజయ్ చందర్ 1967లో ‘సుడిగుండాలు' సినిమాతో కెరీర్ ప్రారంభించారు. ఈ సినిమాకు ఉత్తమ చిత్రం విభాగంలో కేంద్ర ప్రభుత్వం నుంచి జాతీయ అవార్డు లభించడం గమనార్మం. కరుణామయుడు, శ్రీషిర్డీ సాయిబాబా, గీతాంజలి, తదితర సినిమాలలోనూ ఆయన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు రాష్ట్ర అధికార భాషా సంఘానికి కూడా సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. మోదుగుల పాపిరెడ్డి, ఆచార్య షేక్ మస్తాన్, ఆచార్య చందూ సుబ్బారావు, ఆచార్య శరత్ జ్యోత్స్నా రాణిలను సభ్యులు నియమిస్తూ భాషా సంస్కృతిక శాఖ ఆదేశాలు జారీ చేసింది.

ఏపీ కొత్త సీఎస్‌గా నీలం సహానీ?

ఏపీ కొత్త సీఎస్‌గా నీలం సహానీ?

కేంద్ర నుంచి సీనియర్ ఐఏఎస్ అధికారి నీలం సహానీని రిలీవ్ చేశారు. కేంద్ర సాంఘిక సంక్షేమం, సాధికారత మంత్రిత్వశాఖ కార్యదర్శి నీలం సహానీని ఏపీ కేడర్‌కు రిలీవ్ చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఆమె నియమితులవుతారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

ఏపీ కేడర్‌కు రిలీవ్ చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేయడంతో ఆమె రాష్ట్రానికి రానున్నారు. 1984వ బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి అయిన ఆమె కేంద్ర సామాజిక న్యాయశాఖ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయిన తర్వాత ఆమె ఏపీ కొత్త సీఎస్‌గా బాధ్యతలు చేపడతారని తెలుస్తోంది.

తొలి మహిళగా రికార్డ్..

తొలి మహిళగా రికార్డ్..

ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపడితే నూతన ఆంధ్రప్రదేశ్‌లో తొలి మహిళాసీఎస్‌గా సహానీ రికార్డ్ క్రియేట్ చేయనున్నారు. అనూహ్యంగా ఎల్వీ సుబ్రమణ్యాన్నిబదిలీ చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు నీరబ్ కుమార్ ప్రసాద్‌కు ఇంఛార్జీ సీఎస్‌గా బాధ్యతలు అప్పగించింది. సీఎంవో అధికారి ప్రవీణ్ ప్రకాష్‌కు నోటీసులు జారీ చేయడంతోనే ఎల్వీని బదిలీ చేశారనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+