NEET అభ్యర్ధుల కోసం తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక రైళ్లు- ఈ రూట్లలో.. !

వైద్య విద్య ప్రవేశాల కోసం ఈ ఏడాది నిర్వహించిన నీట్ పరీక్ష (NEET 2026) ప్రశ్నాపత్రం లీక్ కావడంతో ఎన్టీఏ దీన్ని రద్దు చేసింది. ఈ నేపథ్యంలో రేపు అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య నీట్ పరీక్షను నిర్వహించేందుకు కేంద్రం సిద్దమవుతోంది. ఇందులో భాగంగా సైన్యాన్ని కూడా రంగంలోకి దింపింది. దీనికి తోడు విద్యార్ధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైల్వేశాఖ కూడా ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ఈ మేరకు దక్షిణ కోస్తా రైల్వే తెలుగు రాష్ట్రాల పరిధిలో ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.

NEET-UG Re-exam 2026: రేపు దేశవ్యాప్తంగా భారీ మాక్ డ్రిల్! చరిత్రలో తొలిసారి..!
NEET-UG Re-exam 2026: రేపు దేశవ్యాప్తంగా భారీ మాక్ డ్రిల్! చరిత్రలో తొలిసారి..!

నీట్ కేంద్రాల్ని కవర్ చేస్తూ తెలుగు రాష్ట్రాల్లోని మూడు రూట్లలో దక్షిణ కోస్తా రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇందులో విశాఖపట్నం-పలాస మార్గంలో రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. విశాఖ నుంచి ఇవాళ ఉదయం 11 గంటలకు బయలుదేరే ప్రత్యేక రైలు మధ్యాహ్నం 3 గంటలకు పలాస చేరుకుంటుంది. అలాగే పలాస నుంచి ఇవాళ రాత్రి 7 గంటలకు బయలుదేరే మరో ప్రత్యేక రైలు అర్ధరాత్రి 12.30కు విశాఖ చేరుకుంటుంది. వీటితో పాటు విశాఖ నుంచి రేపు సాయంత్రం 7 గంటలకు బయలుదేరే మరో ప్రత్యేక రైలు రేపు అర్ధరాత్రి 12.15కు పలాస చేరుకుంటుంది.

NEET Retest 2026 South Coast Railway to Run Special Trains on 2 Routes- here is details
NEET 2026: నీట్ అభ్యర్ధులకు ఆర్టీసీ గుడ్ న్యూస్-ఉచిత బస్సులు, హెల్ప్ డెస్క్ లు..!
NEET 2026: నీట్ అభ్యర్ధులకు ఆర్టీసీ గుడ్ న్యూస్-ఉచిత బస్సులు, హెల్ప్ డెస్క్ లు..!

అలాగే తిరుపతి-చర్లపల్లి మార్గంలోనూ రెండు ప్రత్యేక రైళ్లు ప్రకటించారు. వీటిలో తిరుపతి నుంచి నిన్న రాత్రి 9 గంటలకు బయలుదేరిన రైలు ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. అలాగే చర్లపల్లిలో రేపు రాత్రి 8.25కు బయలుదేరే ప్రత్యేక రైలు తిరుపతికి ఎల్లుండి మధ్యాహ్నం 1.15కు చేరుకుంటుంది. ఈ రెండు రైళ్లకు రేణగుంట, కోడూరు, రాజంపేట, కడప, యర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, గుంతకల్, డోన్, కర్నూలు టౌన్, గద్వాల్, మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్ నగర్, కాచిగూడలో హాల్ట్ లు ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+