ఎల్లుండి బంద్. మోదీ సర్కార్‌పై విద్యార్ధుల పోరుబాట
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తలకిందులు చేసిన 'నీట్ (NEET) క్వశ్చన్ పేపర్ లీకేజీ' వ్యవహారం ఇప్పుడు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పూర్తిగా విఫలమయ్యాయని మండిపడుతూ విద్యార్థులు, నిరుద్యోగ యువత రోడ్లపైకి వచ్చారు. ఈ భారీ కుంభకోణానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్ దేశ రాజధాని అట్టుడుకుతోంది.
కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఎల్లుండి (జులై 24, శుక్రవారం) దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పలు విద్యార్థి, యువజన సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ బంద్ ఉద్యమానికి SFI, PDSU, AISA, NSUI, DYFI, AIYF తదితర వామపక్ష, విద్యార్థి సంఘాల రాష్ట్ర కమిటీలు పూర్తిస్థాయి మద్దతును ప్రకటించాయి. శుక్రవారం రోజున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్-డిగ్రీ కాలేజీలు మరియు యూనివర్సిటీలను మూసివేసి బంద్‌ను విజయవంతం చేయాలని విద్యార్థి లోకానికి పిలుపునిచ్చాయి. పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నిష్పాక్షిక విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే వరకు విశ్రమించేది లేదని హెచ్చరించాయి.

గత రెండు రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ వీధులు విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ, ఇతర ఆందోళనకారులు విద్యాశాఖ మంత్రి నివాసం, జంతర్ మంతర్ వద్ద భారీ స్థాయిలో ధర్నాలు చేపట్టాయి. 'నీట్ రద్దు చేయాలి', 'ఎన్‌టీఏను రద్దు చేయాలి', 'ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి' అంటూ ప్లాకార్డులతో హోరెత్తించారు. పార్లమెంట్ ను ముట్టడించేందుకు ప్రయత్నించిన నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేయడం, పలువురిని ముందస్తుగా అదుపులోకి తీసుకోవడంతో ఢిల్లీ సరిహద్దులు తీవ్ర ఉద్రిక్తతకు వేదికగా మారాయి. నిన్న రాత్రి రాహుల్ గాంధీ సైతం ప్రధాని ఇంటి ముందు ధర్నాకు దిగగా అక్కడ హైటెన్షన్ నెలకొంది.
మరోవైపు, పార్లమెంట్ సమావేశాల్లోనూ నీట్ లీకేజీ అంశం తీవ్ర గందరగోళానికి కారణమైంది. ఉభయ సభలు ప్రారంభమైనప్పటి నుంచే విపక్ష కూటమి నాయకులు నీట్ అంశంపై చర్చ జరపాలని వాయిదా తీర్మానాలు ఇచ్చారు. మరోవైపు దర్మెంధ్ర ప్రధాన్ రాజీనామా తర్వాతే లీకేజీ అంశంపై చర్చ చేపట్టాలని ఇండియా కూటమి డిమాండ్ చేస్తుంది.
కేంద్రంతో చర్చలకు మేం సిద్ధంగా ఉన్నామని సీజేపీ తెలిపింది. జంతర్ మంతర్ లోనే చర్చలు జరగాలని, జేపీ నడ్డా జంతర్ మంతర్ కు రావాలిని డిమాండ్ చేశారు. తాము ఇక జేపీ నడ్డా ఇంటికి వెళ్ళేది లేదని స్పష్టం చేశారు. చర్చల కోసం నాయకులు జంతర్ మంతర్‌కు రావాలి, లేదా కాన్‌స్టిట్యూషన్ క్లబ్ వంటి ఉమ్మడి ప్రదేశంలో సమావేశం జరగాలని తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications