పోలీసు కస్టడీకి నీతూ, ఆళ్లగడ్డకు తరలింపు: గుట్టు తెలిసేనా?
కర్నూలు: మస్తాన్‌వలి, నీతూ అగర్వాల్ సెల్‌ఫోన్ కాల్ లిస్టు అత్యంత కీలకమైన విషయాలను బయటపెట్టినట్లు తెలుస్తోంది. ఆ కాల్ లిస్టులను పోలీసులు పరిశీలించారు. కర్నూలు జిల్లాకు చెందిన ఓ నాయకుడి ప్రధాన అనుచరునితో వారు పలుమార్లు సంభాషించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది.
అరెస్ట్‌కు ముందు కూడా నీతూ అగర్వాల్ ఆ వ్యక్తితో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించినట్లు చెబుతున్నారు. ఆమె ఖాతాకు ఎక్కడి నుంచి సొమ్ము వస్తోంది, ఎవరి ఖాతాకు బదిలీ అవుతోంది, ఎన్ని ఖాతాలు ఉన్నాయి, బ్యాంకు లాకర్లు ఉన్నాయా తదితర వివరాలు సేకరించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేసుకున్నారు.

నంద్యాల సబ్ జైలులో ఉన్న సినీనటి నీతూ అగర్వాల్‌ను రెండు రోజుల పోలీసు కస్టడీకి ఆళ్లగడ్డ కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. ఈ విచారణలో మరిన్ని విషయాలు బయటపడుతాయని భావిస్తున్నారు. అరెస్టు చేసిన తర్వాత నీతూను ఆళ్లగడ్డ న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా రిమాండ్‌కు ఆదేశించడంతో ఆమెను నంద్యాల జైలుకు తరలించారు.
ఎర్రచందనం స్మగ్లర్లకు సహరించిన నీతూను విచారించేందుకు తమ కస్టడీకి అప్పగించాలని జిల్లా పోలీసులు మంగళవారం ఆళ్లగడ్డ కోర్డును ఆశ్రయించారు. దీంతో రెండు రోజుల పాటు నీతూ అగర్వాల్‌ను పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశించింది. బుధవారం ఉదయం నంద్యాల సబ్ జైలు నుంచి నీతూ ఆగర్వాల్‌ను ఆళ్లగడ్డకు తరలిస్తారని అంటున్నారు.
చాగలమర్రికి చెందిన మస్తాన్‌వలి డబ్బులు సంపాదించి సినీనటి నీతూ అగర్వాల్‌తో సినిమా తీసి తదనంతరం ఆమెతో సన్నిహితంగా మెలుగుతూ పెళ్లి చేసుకున్నాడు. హిందీ బాగా మాట్లాడే నీతూతో వలీ ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారాలు చక్కబెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఎర్రచందనం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న సినీనటి నీతూ అగర్వాల్‌ను కర్నూలు పోలీసులు రెండురోజుల పాటు పోలీసు కస్టడీకి తీసుకున్నారు. రుద్రవరం పోలీసలు నీతూ అగర్వాల్‌ను ఆళ్లగడ్డకు తరలించారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ఈమె పాత్ర గురించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications