వైసీపీ ఎమ్మెల్యేకు మేయర్ సవాల్ : నెల్లూరును వీడడానికి సిద్దమేనా?
నెల్లూరు : ఎమ్మెల్యే-మేయర్ కు మధ్య సవాళ్లతో నెల్లూరు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. నగర సమస్యలను వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ ఆరోపణలు చేస్తోన్న నెల్లూరు మేయర్ అబ్దుల్ అజీజ్.. శుక్రవారం నాడు ఆయనకో సవాల్ విసిరారు.
'మన పదవులకు రాజీనామా చేసి ఇద్దరం మళ్లీ పోటీ చేద్దాం. నేను ఓడిపోతే నగరం వదిలి వెళ్లిపోతాను. నువ్వు ఓడిపోతే నగరం వదిలి వెళ్లిపోతావా?' అంటూ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కు మేయర్ అబ్దుల్ అజీజ్ సవాల్ విసిరారు. ఎమ్మెల్యేగా నగరంలో సమస్యల పరిష్కారంపై అనిల్ కుమార్ ఎన్నడూ దృష్టి సారించలేదని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. గత పాలకుల హయాంలో చేసిన రూ.40కోట్ల అప్పును తీర్చి.. నెల్లూరును అభివృద్ది బాట పట్టించానని చెప్పుకొచ్చారు అజీజ్.













Click it and Unblock the Notifications