కీలక కార్పొరేషన్ లో పొత్తు బ్రేక్ - జనసేన ఒంటరి పోటీ, బీ ఫారాలు..!!
మున్సిపల్ ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు నామినేషన్ల ఉప సంహరణకు చివరి రోజు. కూటమి పార్టీల సీట్ల పంపకాల ఒప్పందాల మేరకు పలు చోట్ల మూడు పార్టీల అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేసారు. అయితే.. అనేక ప్రాంతాల్లో రెబల్స్ సైతం బరిలో ఉన్నారు. వారిని విత్ డ్రా చేయించేందుకు తుది ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాగా.. కీలక కార్పోరేషన్ లో మాత్రం కూటమి పొత్తుకు బ్రేక్ పడింది. తాము ఆ కార్పోరేషన్ లో ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు జనసేన ప్రకటించింది.
మున్సిపల్ ఎన్నికల్లో కూటమి పార్టీల సీట్ల సర్దుబాటులో భాగంగా జనసేనకు నాలుగు కార్పోరేషన్లు, 21 మున్సిపాల్టీలను కేటాయించారు. కాగా.. పలు ప్రాంతాల్లో జనసేన, టీడీపీ అభ్యర్ధులు పోటీలోకి వచ్చారు. నామినేషన్లు దాఖలు చేసారు. వీరితో నామినేషన్లను ఉప సంహరించేలా పార్టీల నేతలు రంగంలోకి దిగారు. వారిని బుజ్జగించే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ రోజు నామినేషన్ల విత్ డ్రా కు చివరి రోజు. దీంతో.. ఎవరు చివరకు బరిలో ఉంటారనేది కీలకంగా మారుతోంది. ఈ సమయం లోనే నెల్లూరు నగర కార్పొరేషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు కుదరలేదు. దీంతో జనసేన పార్టీ తాము ఆశించిన డివిజన్లలో స్నేహపూర్వకంగా, ఒంటరిగా బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించింది.

అభ్యర్దులకు జనసేన బీ ఫారాలు
నెల్లూరు నగరంలో మొత్తం 72 డివిజన్లు ఉన్నాయి. కాగా.. టీడీపీ 183 వార్డుల్లో, వైసీపీ 186 వార్డుల్లో, జనసేన 43 చోట్ల నామినేషన్లు దాఖలు చేసాయి. జనసేన తమకు 30 శాతం సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తోంది. టీడీపీ అందుకు అంగీకరించటం లేదు. సీట్ల సర్ధుబాటుపై మంత్రి నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలతో పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ చర్చలు జరిపారు. 5 సీట్లు మాత్రమే ఇస్తామని మంత్రి నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. అయితే 30 శాతం సీట్లు ఇవ్వాలని కోరారు. అందుకు ససేమిరా అంటూ సమావేశం నుంచి వెళ్లిపోయారు. దీంతో, నెల్లూరులో దాదాపు 30 శాతం డివిజన్లలో ఒంటరిగా పోటీ చేయనున్నట్లు పార్టీ కో ఆర్డినేటర్ శివశంకర్ ప్రకటించారు. ఈ రోజు తమ పార్టీ అభ్యర్ధులను బీ ఫారాలు అందించనున్నారు. దీంతో, ఈ మధ్యాహ్నం లోగా రెండు పార్టీల మధ్య సర్దుబాటు కొలిక్కి రాకుంటే.. టీడీపీ, జనసేన మధ్య ఫ్రెండ్లీ కంటెస్ట్ ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. తుది ఫలితం పైన ఉత్కంఠ పెరుగుతోంది.













Click it and Unblock the Notifications
