ఏపీ అసెంబ్లీ వద్ద జనసేన రీల్స్: ఎంతైనా సినిమావాళ్లు కదా
Pawan Kalyan: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం సంకీర్ణ కూటమిలో భాగస్యామ్య పక్షమైన జనసేన నాయకులు, కార్యకర్తలు కాస్త శృతిమించుతున్నట్టే కనిపిస్తోంది. వారి వైఖరి- ఆ పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై విమర్శలకు దారి తీస్తోంది.
ఏపీ శాసన సభ వద్ద జనసేనకు చెందిన ఓ కార్యకర్త, పవన్ కల్యాణ్ అభిమాని ఒకరు.. రీల్స్ చేయడం తాజా వివాదానికి కేంద్రబిందువు అయింది. పవన్ కల్యాణ్ తరహాలో గెటప్ వేసుకున్న ఓ కార్యకర్త అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద రీల్స్ చేశాడు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఉప ముఖ్యమంత్రిగా గౌరవ ప్రదమైన హోదాలో ఉన్న పవన్ కల్యాణ్‌ను ఇమిటేట్ చేశారా కార్యకర్త. ఆయనలాగే గెడ్డం పెంచాడు. ఆయనలాగే దుస్తులను ధరించాడు. పవన్ కల్యాణ్ తరహాలో నడుస్తూ అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద ఈ రీల్స్ చేశాడు. దానికి బ్యాక్ గ్రౌండ్‌గా కేజీఎఫ్ పాటను యాడ్ చేశాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసెంబ్లీని ఆధారంగా చేసుకుని రీల్స్ చేయడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఈ వీడియో పట్ల పలువురు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తోన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు.
తెలుగుదేశం పార్టీకి సినిమా నేపథ్యం ఉండటం, పవన్ కల్యాణ్ స్వయానా మాస్ హీరో కావడం.. వంటి ఉదంతాలను గుర్తు చేస్తోన్నారు. అసెంబ్లీ లోపల కూడా ఒకరు టేబుల్‌పై చేతులు పెట్టి నిల్చున్న వీడియోను వైఎస్ఆర్సీపీ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అసెంబ్లీలో మొబైల్ ఫోన్ తీసుకెళ్లడానికి అనుమతి లేనప్పటికీ వీళ్ళు ఏకంగా రీల్స్ కూడా చేస్తున్నారు అంటూ మండిపడుతున్నారు.
అసెంబ్లీలో రీల్స్ చేసుకుంటున్న జనసైనిక్స్..
— Team YSJR (@Team_YSJR) June 24, 2024
అస్సలు అసెంబ్లీ లో మొబైల్స్ ప్రవేశం ఉండదు అలాంటిది వీళ్ళు ఏకంగా రీల్స్ కూడా చేస్తున్నారు ఎంత దౌర్భాగ్యం పట్టింది రా 😂😂😂#AndhraPradesh #TeamYSJR #APAssembly pic.twitter.com/vvCu0yot20












Click it and Unblock the Notifications