చందాలిద్దాం రండి!: నిన్న బాబు.., నేడు పవన్ కళ్యాణ్ బీద ఏడుపు!!

హైదరాబాద్: మొన్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల పైన, నేడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పైన నెటిజన్లు కౌంటర్లు ఇస్తున్నారు. సర్దార్ గబ్బర్ సింగ్ విడుదల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తనకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని, కనీసం పని వాళ్లకు జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నానని చెప్పారు. నేను చెప్పేది ఎవరూ నమ్మలేకపోవచ్చు కానీ ఇది వాస్తవమని చెప్పారు. జనసేన పార్టీని నడిపేందుకు డబ్బులు లేవంటే సరే గానీ, ఇంట్లో పని చేసే వారికి జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నానని చెప్పడం విడ్డూరమంటున్నారు.

Netizens responds to Pawan Kalyan's Money comments

పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యల ద్వారా అందర్నీ నవ్విస్తున్నారని అంటున్నారు. తన వద్ద డబ్బులు ఎక్కువగా లేవని, దీనిని ఎవరూ నమ్మలేరని, నేను జోక్ చేయడం లేదని, కావాలంటే తన ఇన్‌కమ్ ట్యాక్స్ దస్త్రాలు చూసుకోవచ్చునని చెప్పారు. ఓ టాప్ హీరో అయి ఉండి కనీసం ఇంట్లో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పడం ఏమిటని అంటున్నారు.

గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... తన చేతికి వాచీ కూడా లేదని, తాను కూరగాయలు అమ్మి బతుకుతున్నానని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పైన అప్పుడే విపక్ష నేతలు కౌంటర్ ఇచ్చారు. అయితే, చంద్రబాబు, పవన్ వంటి వారు మరీ ఇంత బీద ఏడుపులు ఏడవటం నమ్మేలా లేదని నెటిజన్లు చురకలు అంటిస్తున్నారు. పవన్ వద్ద డబ్బులేవని, చందాలిద్దామంటూ కొందరు కామెంట్లు కూడా చేస్తున్నారట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+