Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ?

తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం నాడు 77,743 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 30,276 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.59 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 20 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 నుండి 10 గంటల సమయం పట్టింది.

ఆలిపిరి టోల్ గేట్ ఆధునికీకరణకు టీటీడీ పాలక మండలి ఆమోదం తెలిపింది. తిరుమలకు సరుకు రవాణాను క్రమబద్ధీకరించడానికి ప్రత్యేకంగా కార్గో లేన్‌ను నిర్మించనుంది. భక్తుల వాహనాల రద్దీ తగ్గింపు, వారికి మెరుగైన ప్రయాణ వసతి, రాకపోకల్లో భద్రత కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశం. దీనిపై ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

New 11-Lane Alipiri Toll Gate Aims to Ease Congestion for Pilgrims with Exclusive Cargo Lane Reports

దీని ప్రకారం- అలిపిరి టోల్ గేట్ ను ఆధునికీకరిస్తారు. ఇక్కడి చెక్ పోస్టులో మొత్తం 11 లేన్లు అందుబాటులోకి వస్తాయి. వీటిలో రెండు లేన్లను ప్రత్యేకంగా సరుకు రవాణా వాహనాల కోసం కేటాయిస్తారు. ఈ రెండు లేన్లల్లో భక్తుల వాహనాలకు అనుమతి ఉండదు. మిగిలినవి భక్తులు, ఇతర వాహనాల రాకపోకలకు వినియోగిస్తారు. ప్రస్తుతానికి రోజుకు సగటున 10,000కు పైగా వాహనాలను హ్యాండిల్ చేస్తోందీ అలిపిరి చెక్ పోస్ట్.

పండగలు, విశేష ఉత్సవ రోజులు, వారాంతంలో వీటి సంఖ్య పెరుగుతుంది. ఈ ఏడాది జనవరిలో రథసప్తమి నాడు అలిపిరి టోల్ గేట్ వద్ద 14,830 వాహనాలను హ్యాండిల్ చేసింది. ఈ రద్దీని మరింత క్రమబద్దీకరించాలనే ఉద్దేశంతో అలిపిరి టోల్ గేట్ ను పునర్నిర్మించాలని టీటీడీ భావిస్తోంది. ఈ ఆధునికీకరణతో రద్దీ గణనీయంగా తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. భవిష్యత్తులో అవసరాన్ని బట్టి మరో రెండు లేన్ల ఏర్పాటుకు కూడా డిజైన్‌లలో అవకాశం ఉంది.

ప్రతిపాదిత కార్గో లేన్ సుమారు ఒక కిలోమీటరు పొడవు ఉంటుంది. ప్రస్తుత చెక్ పోస్టుకు 650 మీటర్ల ముందున్న వినాయక దేవాలయం వరకు విస్తరిస్తుంది. ఈ ప్రత్యేక లేన్ అందుబాటులోకి రావడం వల్ల ప్రయాణ జాప్యాన్ని తగ్గించడంతో పాటు సరుకులు, ప్రయాణీకుల తనిఖీ మరింత మెరుగుపడుతుందని అధికారులు వివరించారు.

పునరుద్ధరించిన అనంతరం భూదేవి కాంప్లెక్స్ వద్ద ఉన్న కార్గో స్కానర్లను ఆలిపిరికి తరలిస్తారు. వాటిని కొత్త వ్యవస్థలో పూర్తిగా అనుసంధానిస్తారు. కార్గో లేన్ పనులు పూర్తయిన తర్వాతే, చెక్ పోస్ట్ మొత్తం ఆధునికీకరణ చేపడతామని సీవీఎస్ఓ మురళీ కృష్ణ వెల్లడించారు. ఈ ఆధునికీకరణలో భాగంగా డోర్ ఫ్రేమ్‌డ్ మెటల్ డిటెక్టర్లు, వాహన, మానవ, లగేజ్ స్కానర్ల వంటి అధునాతన స్క్రీనింగ్ పరికరాలను టీటీడీ సమకూర్చుకుంటోంది.

ఇప్పటికే మూడు డోర్ ఫ్రేమ్డ్ మెటల్ డిటెక్టర్లను ప్రయోగాత్మకంగా అమర్చారు. ఈ నెలాఖరుకు మరో మూడు డీఎఫ్ఎండీలు, రెండు అదనపు మెటల్ డిటెక్టర్లు అందుబాటులోకి వస్తాయి. లగేజ్ స్కానర్లను మే నాటికి సేకరిస్తారు. వాహన స్కానర్లు, వాహనాల్లోని భక్తులను తనిఖీ చేసే గ్రీన్ స్కానర్ల కోసం టీటీడీ టెండర్లు ఆహ్వానించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+