హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఈజీ జర్నీ: ‘ఫైండ్‌బస్ ఎట్ హైద్’ఆప్ విడుదల(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మొబైల్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ సేవలను అందించడంలో అగ్రగామిగా ఉన్న రిక్తమ్ టెక్నాలజీ కన్సల్టెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్టీసీలో ప్రయాణించే ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేకంగా ‘ఫైండ్‌బస్@హైద్'(find bus@hyd)ఆప్‌ను ప్రవేశపెట్టింది. రిక్తమ్ టెక్నాలజీ మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధారాయ్ షింగ్‌శెట్టి, రిక్తమ్ టెక్నాలజీ డైరెక్టర్ సిద్ధార్థ కొంగత, ఏపిఎస్‌ఆర్‌టిసి, ఇంజినీరింగ్ (హెచ్2అండ్ అండ్జిహెచ్2)-ఈడి, జి. రావు, ఏపిఎస్ఆర్‌టిసి, డిప్యూటీ సిఎమ్ఈ-ఐటి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ ఆప్ ప్రయాణీకులకు వారి గమ్యస్థానాలకు వెళ్లే బస్సుల సమాచారం, బస్సుల నంబర్లు, మార్గమధ్యంలో ఉన్న బస్టాపులు తదితర సమాచారాన్ని ఒక్క క్లిక్‌తో అందించి ప్రయాణికులు ఎంతో సులభంగా వారి గమ్యస్థానాలకు చేరుకునేందుకు తోడ్పడుతుందని సిద్ధారామ్ తెలిపారు. ప్రయాణికులు ప్రారంభస్థానం మరియు గమ్య స్థానాలను ఎంపిక చేసుకుని తమకు కవావాల్సిన సమాచారాన్ని ఈ ఆప్ ద్వారా చిటికెలో పొందవచ్చు. అంతేగాక రూట్ ప్లాన్‌లను కూడా తెలుసుకోవచ్చని తెలిపారు.

ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా బస్సులను గురించి కావాల్సిన సమాచారాన్ని అందించే ఈ ఫైండ్‌బస్@హైద్ ఆప్ అందరినీ ఆకర్షిస్తుందని, ఇదే ఈ ఆప్ యొక్క ప్రత్యేకతని సిద్దార్థ తెలిపారు. ఈ ప్రత్యేక ఆప్ వల్ల ప్రయాణికులు ఎంతో సులభంగా వారు చేరాల్సిన గమ్యస్థానాల్ని ఎవరి సహాయం లేకుండా చేరుకోవచ్చని తెలిపారు. అప్లికేషన్ లింకులు: ఆండ్రాయిడ్ ఫోన్ల కొరకు: http://bit.ly/find-bus-hyd, ఐ ఫోన్ల కొరకు: http//bit.ly/find-bus-hyd-ios.

ఫైండ్ బస్

ఫైండ్ బస్

మొబైల్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ సేవలను అందించడంలో అగ్రగామిగా ఉన్న రిక్తమ్ టెక్నాలజీ కన్సల్టెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్టీసీలో ప్రయాణించే ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేకంగా ‘ఫైండ్‌బస్@హైద్'(find bus@hyd)ఆప్‌ను ప్రవేశపెట్టింది.

ఫైండ్ బస్

ఫైండ్ బస్

రిక్తమ్ టెక్నాలజీ మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధారాయ్ షింగ్‌శెట్టి, రిక్తమ్ టెక్నాలజీ డైరెక్టర్ సిద్ధార్థ కొంగత, ఏపిఎస్‌ఆర్‌టిసి, ఇంజినీరింగ్ (హెచ్2అండ్ అండ్జిహెచ్2)-ఈడి, జి. రావు, ఏపిఎస్ఆర్‌టిసి, డిప్యూటీ సిఎమ్ఈ-ఐటి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఫైండ్ బస్

ఫైండ్ బస్

ఈ ఆప్ ప్రయాణీకులకు వారి గమ్యస్థానాలకు వెళ్లే బస్సుల సమాచారం, బస్సుల నంబర్లు, మార్గమధ్యంలో ఉన్న బస్టాపులు తదితర సమాచారాన్ని ఒక్క క్లిక్‌తో అందించి ప్రయాణికులు ఎంతో సులభంగా వారి గమ్యస్థానాలకు చేరుకునేందుకు తోడ్పడుతుందని సిద్ధారామ్ తెలిపారు.

ఫైండ్ బస్

ఫైండ్ బస్

ప్రయాణికులు ప్రారంభస్థానం మరియు గమ్య స్థానాలను ఎంపిక చేసుకుని తమకు కవావాల్సిన సమాచారాన్ని ఈ ఆప్ ద్వారా చిటికెలో పొందవచ్చు. అంతేగాక రూట్ ప్లాన్‌లను కూడా తెలుసుకోవచ్చని తెలిపారు.

ఫైండ్ బస్

ఫైండ్ బస్

ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా బస్సులను గురించి కావాల్సిన సమాచారాన్ని అందించే ఈ ఫైండ్‌బస్@హైద్ ఆప్ అందరినీ ఆకర్షిస్తుందని తెలిపారు. అప్లికేషన్ లింకులు: ఆండ్రాయిడ్ ఫోన్ల కొరకు: http://bit.ly/find-bus-hyd, ఐ ఫోన్ల కొరకు: http//bit.ly/find-bus-hyd-ios.

English summary

 A city-based mobile application development company, Riktam Technology, has launched an app, ‘FindbusHyd’, to provide information on buses to commuters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X