కొత్త క్రికెట్ బ్యాట్ విరిగి...కొట్లాటకు కారణమైంది

విజయవాడ:కొత్త క్రికెట్‌ బ్యాట్‌ విరిగిందేమిటని అడిగినందుకు కస్టమర్ పై తీవ్రంగా దాడిచేసి కొట్టిన ఉదంతమిది. విజయవాడ నగరంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం....

భవానీపురం రైతు బజారు సమీపంలో నివాసం ఉండే మెడికల్‌ రిప్రజెంటేటివ్‌ పునుగుపాటి భవకుమార్‌ (28) నగరంలోని ఇందిరాగాంధీ షాపింగ్ కాంప్లెక్స్‌లోని ఓ క్రీడల దుకాణంలో రూ 10 వేలు పెట్టి ఒక క్రికెట్‌ బ్యాట్‌ కొన్నాడు. అయితే రెండో రోజే ఆ బ్యాట్‌ విరిగి పోవడంతో ఆందోళన చెందిన భవకుమార్ షాపు వద్దకు వెళ్లి ఇదేంటని అడిగాడు.

New cricket bat caused to attack

దీంతో ఈ విషయమై షాపు నిర్వాహకుడు కళ్యాణ్ కృష్ణకు, బాధితుడు భవకుమార్ కు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి భవకుమార్ కుమ్మరిపాలెం సెంటర్‌ నుంచి ఇంటికి వెళ్తుండగా దుకాణం నిర్వాహకుడు కల్యాణ్‌ కృష్ణ, అతని స్నేహితుడు కొక్కిలిగడ్డ మహేష్‌ గమనించి భవకుమార్ ని అడ్డుకుని అతడిపై దాడి చేసి కొట్టారు. దీంతో గాయపడి చికిత్స పొందిన భవకుమార్ అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న
పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+