జగన్ ఢిల్లీ మధ్య ఏం జరుగుతోంది - అదే ధీమా..!?

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏడాది పాలన పూర్తి చేసుకున్న కూటమి జగన్ లక్ష్యంగా రాజకీయం చేస్తున్నాయి. అటు మాజీ సీఎం జగన్ తన పర్యటనలు.. పరా మర్శల వేళ సీఎం చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు. జగన్ పర్యటనలకు మంచి స్పందన కనిపి స్తోంది. చంద్రబాబు ఏడాది పాలన పైన జగన్ విమర్శలు చేస్తున్నారు. అయితే.. జగన్ లిక్కర్ కేసు లో అరెస్ట్ అవుతారని కూటమి నేతలు ప్రచారం చేసారు. కానీ, జరగలేదు. వైసీపీ నేతల వలసలకు బ్రేక్ పడింది. దీంతో.. అసలు ఏం జరుగుతోందనే చర్చ మొదలైంది.

కీలక పరిణామాలు
మాజీ సీఎం జగన్ పల్నాడు పర్యటన వివాదాస్పదంగా మారింది. జగన్ పర్యటన పైన ఆంక్షలు ఉన్నా పెద్ద సంఖ్యలో జన సమీకరణ జరిగింది. అయితే, వారు స్వతహాగా తరలి వచ్చారని వైసీపీ నేతలు చెబుతున్నారు. అంతకు ముందు తెనాలి, తాడిపర్తి, పొదిలి లోనూ ఇదే రకమైన స్పందన కనిపించింది. ఇదే పర్యటనలో కొందరు ప్రదర్శించిన ప్లకార్డుల వ్యవహారం వివాదాస్పదంగా మారి కేసులు నమోదయ్యాయి. అయితే.. లిక్కర్ కేసులో వైసీపీ కీలక నేతలు అరెస్ట్ అయ్యారు. జగన్ సైతం అరెస్ట్ అవుతారంటూ కూటమి నేతలు చెప్పుకొచ్చారు. కొద్ది రోజుల క్రితం జరిగిన కేబినెట్ భేటీలో మంత్రులతో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. లిక్కర్ కేసులో అరెస్టుల గురించి మాట్లాడవద్దని.. విచారణకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకుంటారని చెప్పారు.

new-doubts-begin-in-nda-leaders-over-public-support-for-ys-jagan-and-cases

ఢిల్లీలో ఏం జరుగుతోంది
2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన తరువాత ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుల్లో ఒక్కరు మినహా మిగిలిన వారంతా బీజేపీలో విలీనం అయ్యారు. ఇప్పుడు 2024 ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత వైసీపీ ఎంపీల పైన పెద్దగా ప్రభావం లేదనే వాదన వినిపిస్తోంది. నలుగురు రాజీనామా చేయగా.. సాయిరెడ్డి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆర్ క్రిష్ణయ్య తిరిగి బీజేపీలో చేరారు. ఒకరిద్దరు మినహా రాజ్యసభ ఎంపీలు వైసీపీ వీడుతారనే ప్రచారం సాగింది. ఢిల్లీ కేంద్రంగా చోటు చేసుకుంటున్న సమీకరణాల కారణంగానే వారు పార్టీ వీడటం లేదనే సందేహం వ్యక్తం అవుతోంది. జగన్ అటు తాడేపల్లి.. అటు బెంగళూరుకే పరిమితం అవుతున్నారు. అయినా, బెంగళూరు కేంద్రంగా వచ్చే ఎన్నికలకు సంబంధించి వ్యూహాలను ఇప్పటి నుంచే పక్కాగా అమలు చేస్తున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది.

https://twitter.com/Samotimes2026/status/1936088812331188723

జగన్ ధీమా అదే
కాగా, కూటమి మద్దతు దారులు మాత్రం జగన్ అరెస్ట్ కోరుకుంటన్నారు. జగన్ అరెస్ట్ కాకపోవటం వెనుక అదృశ్య శక్తి ఉందనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ అరెస్ట్ అనేది రాజకీయ నిర్ణయం గా పేర్కొంటున్న వారు... ప్రభుత్వం పైన వ్యతిరేక మొదలైన కారణంగానే జగన్ కు ఈ స్థాయిలో స్పందన కనిపిస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే, వైసీపీ నుంచి ముఖ్యులు పార్టీ వీడటం లేదు. అధికారం కోల్పోయిన తొలి నాళ్లల్లో పెద్ద సంఖ్యలో పార్టీ వీడగా.. ఇప్పుడు మాత్రం మార్పు కనిపిస్తోంది. అయితే, జనం నుంచి మద్దతు తోనే జగన్ ధీమాగా ఉన్నారనే విశ్లేషణలు ఉన్నాయి. కాగా.. కూటమి పాలనా పరంగా .. రాజకీయంగా తీసుకునే నిర్ణయాలే ఇక్కడ కీలకం కానున్నాయి. జగన్ సైతం త్వరలోనే జిల్లాల పర్యటనలకు సిద్దం అవుతున్నారు. ఇప్పటికే జగన్ వర్సస్ కూటమిగా మారిన ఏపీ రాజకీయం రానున్న రోజుల్లో మరింత ఉత్కంఠగా మారటం ఖాయంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+