ప్రేమ పెళ్లే కానీ..: రాత్రి అమ్మాయి మెడలో తాళి కట్టి.. తెల్లారేసరికి పరార్!
అమరావతి: నాలుగు నెలలుగా ప్రేమిస్తున్నానని వెంటాపడ్డాడు. దీంతో అతని ప్రేమలో నిజాయితీ ఉందేమోననుకుని ఆమె కూడా అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆమె మెడలో మూడు ముళ్లు వేశాడు ఆ యువకుడు. అయితే, రాత్రి అమ్మాయి మెడలో తాళి కట్టి.. తెల్లారేసరికి పరారయ్యాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలంలో చోటు చోటు చేసుకుంది.

నాలుగు నెలలుగా వెంటపడి...
వివరాల్లోకి వెళితే.. పోలాకి మండలంలోని ఓ గ్రమాంలో బాధిత అమ్మాయి ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతోంది. ప్రతీరోజూ ఆమె సైకిల్‌పై కళాశాలకు వెళ్లేది. ఇది గమనించిన అదే గ్రామానికి చెందిన యువకుడు.. మనం పెళ్లి చేసుకుందామంటూ ఆ యువతి వెంటపడ్డాడు సదరు యువకుడు. నాలుగు నెలలు వెంటపడి ప్రేమిస్తున్నాననడటంతో ఆమె కూడా అందుకు అంగీకరించింది.

రాత్రి తాళి కట్టి..
గురువారం రాత్రి ఆమె తన తాత ఇంటి వద్ద ఉన్న విషయం తెలసుకున్న అతను పెళ్లి చేసుకుంగాని నమ్మించాడు. ఆమెను తీసుకుని గ్రామ సమీపంలోని కొండవద్దకు తీసుకెళ్లి అక్కడి అమ్మవారి గుండిలో తాళి కట్టారని ఆమె పర్కొంది. ఆ రాత్రి అక్కడే గడిపి ఉదయాన్నే తనను వదిలి పరారయ్యాడని వాపోయింది బాధితురాలు.

పెద్దలతో మాట్లాడి..
తన తల్లిదండ్రులకు కూడా ఈ విషయం చెప్పానని బాధితురాలు వెల్లడించింది. వారి సూచన మేరకు ఫోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. సదరు యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న యువకుడి కోసం గాలింపు చేపట్టారు. రెండు కుటుంబాలకు చెందిన పెద్దలతో మాట్లాడి వారిద్దరినీ తిరిగి కలిపేందుకు ప్రయత్నిస్తామని చెప్పుకొచ్చారు.

ఇంటర్మీడియట్‌లోనే ప్రేమ.. పెళ్లా..
ఇంటర్మీడియట్ చదువుతున్న యువతి ప్రేమించి పెళ్లి చేసుకోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయస్సులోనే పిల్లలు ప్రేమ, పెళ్లి అనడం ఏంటో అని మండిపడుతున్నారు. పిల్లలు ఏ విషయమైనా ముందే తల్లిదండ్రులకు చెబితే.. సమస్యలు రాకుండా ఉంటాయని వారు హితవులు పలుకుతున్నారు. అనాలోచిత, అపరిపక్వ నిర్ణయాలు తీసుకుని తల్లిదండ్రులను బాధపెట్టవద్దని సూచిస్తున్నారు.
-
ఒక్క పోస్టుతో అందరికీ ఇచ్చిపడేసిన "త్రిష".. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' మూవీ ఫస్ట్ రివ్యూ: హిట్టు కొట్టి కొట్టి బోర్ కొట్టట్లేదా అన్నా..!! -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
జగన్ సెగ ఎక్కడ తాకాలో అక్కడ తాకింది.. -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
ఏం ప్లాన్ చేశావ్ భాయ్ -
బంగారం ధరల్లో బిగ్ డౌన్ ఫాల్.. !! -
IMDB అల్లు అర్జున్ టాప్-10 మూవీస్.. ‘పుష్ప2’కు దక్కని చోటు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం, ద్రోణి- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications