వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ్మో ఏపీనా ? మొహం చాటేస్తున్న పరిశ్రమలు-ఉన్నవీ క్రమంగా మాయం- అసలు కారణాలివే

|
Google Oneindia TeluguNews

ఏపీకి కొత్త పరిశ్రమలు ఎందుకు రావడం లేదు ? సరే ఉన్నవి కూడా ఎందుకు పారిపోతున్నాయి ? పరిశ్రమల్ని ఆకర్షించేందుకు గతంలో ప్రభుత్వాలు అనుసరించిన విధానాలు ఇప్పుడు పనికి రావడం లేదా ? లేక ప్రభుత్వమే తన కొత్త విధానాలతో పరిశ్రమల రానీయకుండా చేస్తోందా ? ఇతర రాష్ట్రాలు పోటీ పడి మరీ కొత్త పరిశ్రమలు తెచ్చుకుంటుంటే, ప్రోత్సాహకాలు ప్రకటిస్తుంటే, పరిశ్రమలకు అండగా నిలుస్తుంటే ఏపీ మాత్రం ఎందుకిలా వ్యవహరిస్తోంది ? అసలు తప్పెక్కడ జరుగుతోంది ? తెలుసుకోవాంటే ఈ స్టోరీ తప్పక చదవాల్సిందే....

 ఏపీలో పారిశ్రామికాభివృద్ది

ఏపీలో పారిశ్రామికాభివృద్ది


ఏపీలో గత కొన్నేళ్లుగా పారిశ్రామిక వృద్ది నత్తనడకన సాగుతున్న తరుణంలో విభజన తర్వాత నష్టపోయిన ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు గత టీడీపీ ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసింది. వీటి ఫలితంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సూచీల్లో ఏపీ టాప్ లో నిలిచింది. ప్రతీ ఏటా ప్రకటించే ఈ ర్యాంకుల్లో ఏపీ మెరుగైన స్ధితిలో నిలిచింది. దీంతో సహజంగానే అంబానీకి చెందిన రిలయన్స్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్, అదానీ మెగా డేటా హబ్, లులూ గ్రూప్ విశాఖలో భారీ కన్వెన్షన్ సెంటర్ నిర్మించేందుకు ముందుకు వచ్చాయి. దీంతో అంతా సవ్యంగా సాగిపోతుందని భావిస్తున్న తరుణంలో ఎదురుదెబ్బలు మొదలయ్యాయి.

వైసీపీ సర్కార్ హయాంలో

వైసీపీ సర్కార్ హయాంలో

ఏపీలో రెండేళ్ల క్రితం వైసీపీ సర్కార్ ఏర్పాటు కాగానే పరిశ్రమలు వెనక్కి తగ్గడం మొదలుపెట్టాయి. గత టీడీపీ ప్రభుత్వంలోనే భూముల్ని అప్పగించేందుకు ఒప్పందాలు కుదిరినా, వాటిపై వైసీపీ సర్కార్ సీరియస్ గా దృష్టిపెట్టలేదు. దీంతో వివాదాల్లో ఉన్న భూముల్ని కట్టబెట్టారంటూ ఒక్కో పరిశ్రమా తరలిపోవడం మొదలైంది. అదే సమయంలో వైసీపీ సర్కార్ తీసుకొచ్చిన కొత్త పారిశ్రామిక విధానం పరిశ్రమల్ని ఆకర్షించలేకపోయింది. దీంతో ఉన్న పరిశ్రమలు తరలిపోవడంతో పాటు కొత్త పరిశ్రమలు రావడం కూడా మానేశాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కడప స్టీల్ ప్లాంట్ విషయంలోనూ పరిశ్రమలు ముందుకు రావడం లేదు.

పారిశ్రామిక విధానంలో లోపాలు

పారిశ్రామిక విధానంలో లోపాలు

ఏ రాష్ట్రంలో అయినా పారిశ్రామిక విధానం రూపొందించేటప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్న అనుకూలతలు, అలాగే కొత్తగా తాము కల్పించే సౌకర్యాలు, రాయితీలు స్పష్టంగా వివరించి పరిశ్రమల్ని అహ్వానిస్తుంటారు. కానీ వైసీపీ సర్కార్ లో మాత్రం ఈ విధానం కొరవడింది. కొత్త పరిశ్రమలు వచ్చేందుకు అవసరమైన వాతావరణం కల్పించాల్సింది పోయి తాము పెట్టుకున్న నిబంధనల్ని గౌరవిస్తేనే ఇక్కడ పరిశ్రమలు పెట్టేందుకు అవకాశం కల్పిస్తామన్న వాదనతో ప్రభుత్వం ముందుకు పోయింది. ఫలితంగా రాష్ట్రంలో పెట్టుబడుల కోసం వచ్చే పారిశ్రామిక వేత్తల్లో నిరుత్సాహం మొదలైంది.

పారిశ్రామిక సదస్సులేవీ

పారిశ్రామిక సదస్సులేవీ

గతంలో పరిశ్రమల్ని ఆకట్టుకునేందుకు తమ పారిశ్రామిక విధానాల్ని వివరిస్తూనే, కొత్తగా తామేం ప్రోత్సాహకాలు ఇస్తామో వారికి తెలిసేలా ప్రభుత్వాలు బిజినెస్ కాన్ క్లేవ్ లు నిర్వహించేవి. వీటికి పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాలకు చెందిన పారిశ్రామిక వేత్తల్ని ఆకర్షించేవి. కానీ వైసీపీ సర్కార్ లో మాత్రం అలాంటి ప్రయత్నాలు జరగడం లేదు. ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో ఓ సదస్సు నిర్వహించిన ప్రభుత్వం.. ఆ తర్వాత ఢిల్లీలో ఓ సదస్సు నిర్వహించి చేతులు దులిపేసుకుంది. దీంతో పరిశ్రమల విషయంలో ప్రభుత్వ విధానం వారిని ఆకట్టులేకపోయిందని తేలిపోయింది. అప్పుడైనా ప్రభుత్వం మేల్కొందా అంటే అదీ లేదు. దీంతో పారిశ్రామిక వేత్తలు మొహం చాటేశారు.

 ప్రోత్సాహకాలపై సర్కార్ అనాసక్తి

ప్రోత్సాహకాలపై సర్కార్ అనాసక్తి


రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు పెట్టేందుకు వచ్చే వారికి ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కొన్ని రాయితీలు ఇస్తుంది. ఇందులో ఎక్కువ రాయితీలు ఇచ్చే, ప్రోత్సాహకాలు ఇచ్చే రాష్ట్రాలకు పరిశ్రమలు సహజంగానే తరలివెళ్తుంటాయి. కానీ ఏపీలో మాత్రం కొత్తగా ఏర్పాటయ్యే పరిశ్రమలకు రాయితీలు ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ఇచ్చినా అరకొర రాయితీలతోనే సరిపెడుతోంది. రాష్ట్రంలో ఉన్న పరిస్ధితుల్ని అంచనా వేసుకుని వాటిని బట్టి సదరు పరిశ్రమ తమకు ఎంత ముఖ్యమో ఆలోచించి దాన్ని ఆకట్టుకునేందుకు ప్రోత్సాహకాలు ప్రకటించాల్సింది పోయి అన్నింటికీ ఒకటే మందు అన్నట్లుగా వ్యవహరించడం వల్ల నష్టం జరుగుతోంది.

ఉసురుతీస్తున్న స్ధానిక కోటా ఉద్యోగాలు

ఉసురుతీస్తున్న స్ధానిక కోటా ఉద్యోగాలు

రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు పెట్టాలని వచ్చే వారికి ప్రభుత్వం పారిశ్రామిక విధానంలో భాగంగా విధించిన 75 శాతం ఉద్యోగాలుప స్ధానికులకే ఇవ్వాలనే నిబంధన నిరుత్సాహపరిచేలా ఉంది. ఏ పరిశ్రమ అయినా నిపుణులైన సిబ్బందిని నియమించుకుని వ్యాపారం చేస్తుంది. అలా కాకుండా స్ధానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పడం ద్వారా మాకోసం మీ పరిశ్రమ నడపమని కోరడమే అవుతోంది. దీంతో సర్కార్ చెప్పినట్లు 75 శాతం ఉద్యోగాలు స్దానికులకు ఇవ్వలేక ఎన్నో పరిశ్రమలు ఏపీకి వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు.

Recommended Video

Ys Jagan : గాంధీ జయంతి రోజునే సంచలనం.. ఇక ప్రజల్లోనే | Ys Jagan Cares || Oneindia Telugu
పరిశ్రమల ఉసురుతీస్తున్న జగన్ సర్కార్

పరిశ్రమల ఉసురుతీస్తున్న జగన్ సర్కార్

రాష్ట్రంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగా రాష్ట్రంలో ఇప్పటికే ఏదో విధంగా వచ్చిన రిలయన్స్, అదానీ, లులూ గ్రూప్ వంటి మెగా పరిశ్రమలు సైతం తరలిపోయాయి. భూవివాదాల కారణంగానే పరిశ్రమలు తరిలిపోతున్నాయని చెబుతున్న ప్రభుత్వం, వాటిని పరిష్కరించడమో లేక ప్రత్యామ్నాయ భూమి కేటాయిస్తామనో చెప్పి వాటిని కాపాడుకుని ఉంటే ఇప్పటికి రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి బాటలు పడేవి. కానీ ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయకపోవడంతో అవి ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయి. మరికొన్ని పరిశ్రమలు అసలు ఏపీలో ఉన్న సమస్యలకు ఇప్పుడు రావడం అవసరమా అన్న భావనలో ఉన్నాయి. మరోవైపు రాష్ట్రంలో మూడు రాజధానుల వ్యవహారంతో ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలియక కొత్త పరిశ్రమల యజమానులు గందరగోళంలో ఉన్నారు. దీంతో ఇప్పట్లో కొత్త పరిశ్రమల ఏర్పాటు అసాధ్యంగానే కనిపిస్తోంది.

English summary
andhrapradesh govt's industrial policy fails to attract number of new industries in the state because of its guidelines.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X