ఒక్క రోజులో మందుబాబులు ఎన్ని కోట్లు తాగేసారో తెలుసా..!?
న్యూ ఇయర్ జోష్ రెండు తెలుగు రాష్ట్రాల ఆదాయం పెంచింది. మందు బాబులు రికార్డు ఆదాయం తెచ్చి పెట్టారు. ఏపీ - తెలంగాణలో మద్యం అమ్మకాలతో భారీ ఆదాయం వచ్చింది. ఏపీలో డిసెంబర్ 31వ తేదీ ఒక్కరోజే దాదాపుగా రూ 127 కోట్ల మేర అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ 29న ఏపీలో రూ 72.3 కోట్ల మేర విక్రయాలు జరగ్గా.. 30వ తేదీన రూ 86 కోట్ల మేర లిక్కర్ సేల్స్ జరిగినట్లు అధికారులు నిర్దారించారు. సాధారణ రోజుల్లో రూ 72 కోట్ల మేర లిక్కర్ అమ్మకాలు ఉండేవి. ఇటు తెలంగాణలో డిసెంబర్ 31వ తేదీ ఎక్సైజ్ శాఖకు భారీగా ఆదాయం వచ్చింది. ఒక్క రోజే నిన్న ఒక్కరోజే అబ్కారీ శాఖకు 215 కోట్ల 74 లక్షల ఆదాయం సమకూరింది. అమ్మకాలు తగ్గినప్పటికీ ధరలు పెరిగిన కారణంగా ఆదాయాన్ని సమకూర్చుకుంది.
తెలంగాణలో మొత్తం 19 మద్యం డిపోల్లో దాదాపుగా 2 లక్షల 17 వేల 444 లిక్కర్ కేసులు అమ్మకాలు జరిగాయి. అదే సమయంలో ఒక లక్ష 28వేల 455 కేసుల బీర్ కేసులు అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. కేవలం హైదరాబాద్ రెండు డిపోల నుంచి రూ 37 కోట్ల 68 లక్షల అమ్మకాలు జరిగాయి. ఇక, 2022లో తెలంగాణలో రూ 34 వేల కోట్ల మేర మద్యం అమ్మం జరిగింది. 2021తో పోలిస్తే ఇది ఏడు వేల కోట్లు అధికం. మద్యం అమ్మకాల్లో ఈ ఏడాది రంగారెడ్డి, హైదరాబాద్ టాప్ లో నిలిచాయి. రూ. 3,638 కోట్లతో హైదరాబాద్ జిల్లా రెండో స్థానాన్ని ఆక్రమించింది. నల్లగొండ(రూ. 3,447 కోట్లు), వరంగల్ అర్బన్(రూ.3,395 కోట్లు), కరీంనగర్(రూ. 2,893కోట్లు), మెదక్(రూ. 2,841 కోట్లు), మహబూబ్‌నగర్(రూ. 2,415కోట్లు), ఖమ్మం(రూ. 2,145 కోట్లు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ప్రత్యేకించి 2022 ఏప్రిల్-నవంబరు నెలల మధ్యలోనే రూ. 25,147 కోట్ల మేర లిక్కర్ సేల్స్ జరిగాయి. ఈ మధ్యకాలంలో బీర్ అత్యధికంగా అమ్ముడైంది. మందుబాబులు 3.48 కోట్ల కేసుల(కార్టన్ల) మేర బీర్‌ను కొనుగోలు చేశారు. మిగతా లిక్కర్ సేల్స్ 2.52 కేసుల మేర జరిగాయి. 2014లో రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఇప్పటి వరకు రెండు సార్లు మద్యం ధరలను పెంచింది. కొత్త లిక్కర్ పాలసీతో షాపుల సంఖ్యను పెంచింది. 2021లో కేవలం లిక్కర్ షాపుల దరఖాస్తుల ద్వారానే ఆబ్కారీ శాఖకు రూ. 1,200 కోట్ల మేర ఆదాయం వచ్చింది. 2014-15తో పోలిస్తే.. మద్యం విక్రయాలు ఏయేటికాయేడు పెరుగుతున్నాయి. 2014-15లో మద్యంపై రూ. 10,888 కోట్ల మేర ఆదాయం రాగా, ఐదేళ్లలో.. అంటే.. 2018-19కి అది రెట్టింపు (రూ. 20,850 కోట్లు) అయ్యింది. ఇక, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ న్యూ ఇయర్ సందర్భంలో ఎక్సైజ్ ఆదాయం అంచనాలకు మించి రావటంతో ఖజనాకు ఆదాయం వచ్చింది.












Click it and Unblock the Notifications