కోటంరెడ్డికి టీడీపీ భారీ ట్విస్ట్ - వాట్ నెక్స్ట్..!?
కోటంరెడ్డి కేంద్రంగా టీడీపీ వర్సస్ వైసీపీ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది.
వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారంలో కొత్త ట్విస్ట్ . వైసీపీ నాయకత్వంతో విభేదించిన కోటంరెడ్డి టీడీపీలో అంతా సిద్దం చేసుకున్నారని ప్రచారం సాగింది. వచ్చే ఎన్నికల్లో తాను టీడీపీ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నానని కోటంరెడ్డి చెప్పుకొచ్చారు. చంద్రబాబు నిర్ణయం ఫైనలని స్పష్టం చేసారు. అటు వైసీపీ నెల్లూరు రూరల్ లో ఎంపీ ఆదాలను రంగంలోకి దించింది. నియోజకవర్గంలోని పార్టీ కేడర్ కోటంరెడ్డితో వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే, కోటంరెడ్డి గురించి నెల్లూరు టీడీపీలో ఇప్పుడు ఆసక్తి కర చర్చ సాగుతోంది.

టీడీపీలోకి కోటంరెడ్డికి ఛాన్స్ ఉందా
వైసీపీ ప్రభుత్వం..నాయకత్వం పైన తిరుగుబాటుకు ముందే కోటంరెడ్డి టీడీపీ అధినేతతో సమావేశమయ్యారని వైసీపీ నేతల ఆరోపణ. తాను పార్టీని వద్దని నిర్ణయించిన తరువాత ఎవరితో కలిసినా వారికి అనవసర మని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి నెల్లూరు రూరల్ అభ్యర్ధిగా కోటంరెడ్డికి హామీ దక్కిందని అనుచర వర్గం కూడా చెబుతూ వచ్చింది. కోటంరెడ్డి సైతం అవే సంకేతాలు ఇచ్చారు. కానీ, ఇప్పటికీ సాంకేతికంగా కోమటిరెడ్డి వైసీపీ ఎమ్మెల్యేగానే ఉన్నారు. ఆయన పైన పార్టీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇటు కోటంరెడ్డి ఇంకా అధికారికంగా టీడీపీలో చేరలేదు. ఈ సమయంలోనే జిల్లా టీడీపీ నేతల్లో కొత్త చర్చ మొదలైంది. పార్టీలో ఎవరైనా చేరవచ్చని నేతలు చెబుతున్నారు. కానీ, సీటు గురించి మాత్రం ముందే ప్రకటనలు చేసుకోవటం మాత్రం సాధ్యపడదని స్పష్టం చేస్తున్నారు.2.

నాయకత్వం ఇంకా నిర్ణయించలేదంటూ
కోటంరెడ్డి విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు..లోకేష్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని నెల్లూరు టీడీపీ నేతలు చెబుతున్నారు. టీడీపీలో చేర్చుకోవటం.. సీటు కేటాయించటం వంటివి జిల్లా నేతలతో చర్చించి న తరువాతనే ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. కోటంరెడ్డి గురించి ఎక్కడా పార్టీ నేతలు స్పందించటం లేదు. అయితే, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు కోటంరెడ్డికి వ్యతిరేకంగా పని చేసిన నేతలు మాత్రం పార్టీలో చేరికను వ్యతిరేకిస్తున్నారు. పార్టీ అధినాయకత్వం ఈ అంశం పైన స్పందించి..నిర్ణయం తీసుకుంటే తమ అభిప్రాయం చెప్పాలనే ఉద్దేశంతో నేతలు ఉన్నారు. నియోజకవర్గంలో కోటంరెడ్డి తమకు వేధించారని..అటువంటి వాళ్లతో కలిసి పని చేసే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. ఇదే ఇప్పుడు నిర్ణయం తీసుకోవటానికి పార్టీ నాయకత్వానికి సమస్యగా మారుతోంది.

నేతల సైలెన్స్.. వాట్ నెక్స్ట్...
కోటంరెడ్డి ఎపిసోడ్ లో చంద్రబాబు - లోకేష్ మౌనం పాటిస్తున్నారు. అటు ఆనం పార్టీ వ్యతిరేకంగా మాట్లాడినా..ఎక్కడా టీడీపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేయలేదు. తాను టీడీపీ నుంచి పోటీ చేస్తున్నట్లు బయట పడలేదు.టీడీపీ కాదంటే తనకు ప్రత్యామ్నాయ పార్టీలు ఉన్నాయని కోటంరెడ్డి ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేసారు. టీడీపీ నాయకత్వం కోటంరెడ్డిని పార్టీలో చేర్చుకుంటూ అధికారికంగా నిర్ణయం తీసుకుంటే ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ పార్టీలో ఎటువంటి స్పందన వస్తుందనే ఆందోళన కనిపిస్తోంది. ఇదే సమయంలో టీడీపీకి షాక్ ఇవ్వాలనే ఆలోచనలో వైసీపీ జిల్లాలో కౌంటర్ ఆపరేషన్ ప్రారంభించింది. దీంతో..ఇప్పుడు కోటంరెడ్డి కేంద్రంగా టీడీపీ వర్సస్ వైసీపీ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications