అర్ధనగ్నవీడియోతో: రిషికేశ్వరి మృతిలో కొత్త కోణం, నాగార్జున వర్సిటీలో ఉద్రిక్తత
గుంటూరు: నాగార్జున విశ్వవిద్యాలయంలో రిషికేశ్వరి ఆత్మహత్య ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆత్మహత్య చేసుకున్న ముందురోజు రిషికేశ్వరిని సీనియర్ విద్యార్థులు వేధించారని, అర్ధనగ్నంగా హాస్టల్ గదిలో నడిపించి, దానిని సెల్ ఫోన్లో చిత్రీకరించారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత ఆ వీడియోను ఇతరులకు పంపించారని, తమతో సన్నిహితంగా ఉండకపోతే ఈ వీడియోలు బహిర్గతం చేస్తామని సీనియర్లు బెదిరించారని, ఈ ఘటనతో మనస్తాపం చెందిన రిషికేశ్వరి ఆత్మహత్య చేసుకొని ఉంటుందని అంటున్నారు.
ఈ కేసులో ఇప్పటికే శ్రీనివాస్, అనిషా అనే విద్యార్థులత ోపాటు, శ్రీచరణ్ అనే లెక్చరర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

నాగార్జున వర్సిటీలో ఉద్రిక్తత
రిషికేశ్వరి మృతి కేసులో నాగార్జున విశ్వవిద్యాలయంలో నిజనిర్ధారణ కమిటీ గురువారం నాడు బహిరంగ విచారణ చేపట్టింది. ఇది ఉద్రిక్తతకు దారి తీసింది. విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగారు.
రిషికేశ్వరి మృతి పైన సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కొందరు విద్యార్థులు డిమాండ్ చేశారు. కొందరు ప్రిన్సిపల్‌కు అనుకూలంగా, మరికొందరు ప్రిన్సిపల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఇరువర్గాల విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది.












Click it and Unblock the Notifications