సాయిశ్రీ కేసులో ట్విస్ట్: తెరపైకి నీలిమ, సుమశ్రీ క్యారెక్టర్ మంచిది కాదని భర్త
విజయవాడలో క్యాన్సర్‌తో మృతి చెందిన సాయిశ్రీ కేసులో మరో కొత్త ట్విస్ట్. తన భర్త కృష్ణకుమార్ తనకు తెలియకుండా సుమశ్రీని రెండో పెళ్లి చేసుకున్నాడని నీలిమ గురువారం వారి ఇంటి ముందు ఆందోళనకు దిగింది.
విజయవాడ: విజయవాడలో క్యాన్సర్‌తో మృతి చెందిన సాయిశ్రీ కేసులో మరో కొత్త ట్విస్ట్. తన భర్త కృష్ణకుమార్ తనకు తెలియకుండా సుమశ్రీని రెండో పెళ్లి చేసుకున్నాడని నీలిమ గురువారం వారి ఇంటి ముందు ఆందోళనకు దిగింది.
కృష్ణకుమార్ తనను వివాహం చేసుకున్నాడని, తమకు పిల్లలు ఉన్నారని ఆమె చెప్పారు. కానీ ఆ తర్వాత సుమశ్రీని తనకు తెలియకుండా పెళ్లి చేసుకున్నాడని ఆరోపిస్తోంది.

నీలిమతో నాకు పెళ్లి కాలేదని కృష్ణ కుమార్
నీలిమ ఆరోపణలపై కృష్ణకుమార్ స్పందించారు. తాను నీలిమను పెళ్లి చేసుకోలేదని, తమ కేసు కోర్టులో ఉందని చెబుతున్నారు. నీలిమ తనపై కుట్రపూరితంగా కేసు పెట్టిందని, అందుకే న్యాయస్థానంలో ఫైట్ చేస్తున్నానని చెప్పారు.

సుమశ్రీ వ్యక్తిత్వం మంచిది కాదని.. మాదంశెట్టి శివ ట్విస్ట్
మరోవైపు, సాయిశ్రీ అసలు తన కూతురు కాదని మాదంశెట్టి శివ చెబుతున్నారు. సుమశ్రీ వ్యక్తిత్వం మంచిది కాదని ఆయన ఆరోపిస్తున్నారు. సాయిశ్రీ తన కూతురు కాదని పేర్కొంటూ ఆయన వాట్సాప్ సందేశం కూడా చేశారని తెలుస్తోంది.

అన్నీ చిక్కుముడులే
సాయిశ్రీ మృతి నేపథ్యంలో రోజుకో కొత్త కోణం కనిపిస్తోంది. తన కూతురు సాయిశ్రీ మృతికి తన భర్త మాదంశెట్టి శివ కారణమని సుమశ్రీ ఆరోపించింది. ఆయన తమను పట్టించుకోవడం లేదని ఆరోపించింది. మాదంశెట్టి శివ మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేశారు.

తెరపైకి నీలిమ
ఈ వివాదం కొనసాగుతుండగానే నీలిమ అనే మహిళ తెరపైకి వచ్చింది. తన భర్త కృష్ణకుమార్.. సుమశ్రీని తనకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకున్నాడని ఆరోపించింది. మొత్తానికి చిన్నారి సాయిశ్రీని వివాహేతర సంబంధం బలితీసుకుందని అంటున్నారు.
-
తెలంగాణాకు కొత్త టెన్షన్.. క్యాన్సర్ కేసులపై ఐసీఎంఆర్ షాకింగ్ నివేదిక! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..












Click it and Unblock the Notifications