Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యాంకర్ తేజస్విని ఆత్మహత్య, భర్త అరెస్ట్!: మరో యువతితో.. సూసైడ్ నోట్‌లో ఏముందంటే?

విజయవాడ: కృష్ణా జిల్లాలోని ఎంబీఎంఆర్ కాలనీలో ఆత్మహత్య చేసుకున్న మాజీ యాంకర్ కేసులో ఆమె భర్త పవన్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె సూసైడ్ లేఖ ఆధారంగా పోలీసులు దర్యాఫ్తు చేసి అతనిని మంగళవారం అరెస్టు చేశారని తెలుస్తోంది. ఆమె రెండు పేజీల లేఖ రాసింది.

Recommended Video

    మాజీ యాంకర్ తేజస్విని కేసు లో కొత్త ట్విస్ట్

    తేజస్విని హత్య కేసుల సూసైడ్ నోట్ కీలకంగా మారింది. భర్త పవన్ వేరే మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడని ఆమె లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త మారుతాడని ఎదురు చూశానని, కానీ మారలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మారుతాడని చూసి మోసపోయానని ఆమె పేర్కొన్నారు.

    పవన్ కోసం గాలింపు, అరెస్టు

    పవన్ కోసం గాలింపు, అరెస్టు

    తేజస్విని రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అంతకుముందు పోలీసులు మాట్లాడుతూ.. తేజస్విని ఆత్మహత్య వెనుక భర్త పవన్ కుమార్ ప్రమేయం ఉందని ప్రాథమిక సాక్ష్యాలు లభించాయని, ఆయన పరారీలో ఉన్నాడని చెప్పారు. అతనిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పవన్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు తెలిపారు. అయితే ఆ తర్వాత అతనిని అరెస్టు చేశారు.

    పవన్ ఫోన్ సీజ్

    పవన్ ఫోన్ సీజ్

    కంకిపాడు పోలీస్ స్టేషన్లో తేజస్విని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సూసైడ్ నోట్లో ఆమె రాసిన వివరాలు, తల్లిదండ్రులను విచారించిన తర్వాత లభించిన వివరాలకు పొంతన కుదరలేదని, అందుకే కేసు విచారణ జఠిలమైందన్నారు. పవన్ ఫోన్‌ను పోలీసులు సీజ్ చేశారు. దానిలోని సమాచారాన్ని విశ్లేషించారు.

    సూసైడ్ నోట్లో ఏముందంటే

    సూసైడ్ నోట్లో ఏముందంటే

    తన భర్త చేతిలో తాను మోసపోయానని తేజస్విని సూసైడ్ నోట్లో పేర్కొనడంతో పాటు తన కుమార్తెను బాగా చూసుకోవాలని కూడా పేర్కొంది. తేజస్విని సూసైట్ నోట్ ఆధారంగా పవన్ పైన పోలీసులు 498ఏ, 306 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

    నా కన్నా స్నేహితులే ఎక్కువయ్యారు

    నా కన్నా స్నేహితులే ఎక్కువయ్యారు

    పవన్ కుమార్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని, నమ్మి వచ్చినందుకు నన్ను వేధించాడని, ఇబ్బందులు పెడుతున్నాడని, నా కన్నా స్నేహితులే అతనికి ఎక్కువ అయ్యారని, తనను పట్టించుకోవడం లేదని, అందుకే మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్‌లో తేజస్విని పేర్కొంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+