టిజి కాదు.. 'టిఎస్' నెంబర్ ప్లేట్లు, కోడ్‌లు ఇవేనా?

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వాహనాలకు సంబంధించి ఇకపై టీఎస్ కోడ్‌తో రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. గురువారం నుంచే ఇది అమల్లోకి వస్తుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణలోని వాహనాలకు టిజి పేరుతో రిజిస్ట్రేషన్లు జరపాలని తొలుత నిర్ణయించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు టీఎస్ పేరుతో రిజిస్ట్రేషన్లకు కేంద్రం అంగీకరించింది. బుధవారం ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర రవాణా మంత్రి మహేందర్ రెడ్డి వెల్లడించారు.

ఇప్పటి వరకూ ఏపీ పేరు మీద చేస్తున్న రిజిస్ట్రేషన్లు ఇక టీఎస్ కోడ్‌తో జరుగుతాయని పేర్కొన్నారు. బుధవారం తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 73 లక్షల వాహనాలకు తిరిగి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుందన్నారు. ఆయా వాహనాలకు ఇన్నాళ్లుగా ఉన్న ఏపీ కోడ్ స్థానంలో టీఎస్‌ను చేర్చి ప్రస్తుత నెంబర్‌ను యథాతథంగా కొనసాగించడం సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు.

తాజా నిర్ణయంతో ఆయా వాహనాల జిల్లా కోడ్‌లతోపాటు నెంబర్ కూడా మారిపోతుందని చెప్పారు. నెంబర్లు మార్పులో ఫ్యాన్సీ నెంబర్లు, సెంటిమెంటు నెంబర్లకు సైతం ఎటువంటి మినహాయింపూ ఉండదన్నారు. దీనివల్ల రవాణాశాఖకు వేలాది రూపాయలు ప్రత్యేకంగా చెల్లించి ఈ నెంబర్లను కొనుగోలు చేసిన వాహనదారులకు జరిగే నష్టంపై ఆలోచించాల్సి ఉందన్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న వాహనాలను తిరిగి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి చార్జీలు ఎంత వసూలు చేయాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.

New vehicle registrations in Telangana state

వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజలు, ఫ్యాన్సీ నెంబర్లు విషయంలో ప్రజల నుండి వ్యతిరేకత రాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటామన్నారు. ప్రస్తుత వాహనదారులు తిరిగి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి నాలుగు నెలల గడువు ఇస్తామని, అవసరమైతే దీనిని పొడిగిస్తామన్నారు. తెరాస ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఆటోలపై వసూలు చేసే రవాణా పన్నును ఎత్తివేయడానికి కూడా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

సమాచారం మేరకు జిల్లాల కోడ్‌లను రవాణా శాఖ అధికారులు ఇప్పటికే ఖరారు చేసినట్లు తెలుస్తోంది. టీఎస్ 01ను ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్‌కు, టీఎస్ 02ను హైదరాబాద్ సెంట్రల్ (ఖైరతాబాద్), టీఎస్ 03 హైదరాబాద్ నార్త్ (సికింద్రాబాద్), టీఎస్ 04 హైదరాబాద్ ఈస్ట్ (మలక్‌పేట), టీఎస్ 05 హైదరాబాద్ సౌత్ (కిషన్‌బాగ్ సౌత్), టీఎస్ 06 హైదరాబాద్ వెస్ట్ (మొహిదీపట్నం), టీఎస్ 07 కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, టీఎస్ 08 ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, ఇల్లెందు, మణుగూరు, టీఎస్ 09 మహబూబ్‌నగర్, పెబ్బేరు, గద్వాల, టీఎస్ 10 మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, పటాన్‌చెరు, టీఎస్ 11 నల్గొండ, సూర్యాపేట, మిర్యాలగూడ, భువనగిరి, బీబీనగర్, టీఎస్ 12 నిజామాబాద్, టీఎస్ 13 అత్తాపూర్, కూకట్‌పల్లి, మేడ్చల్, టీఎస్ 14 ఉప్పల్‌కలాన్, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి, టీఎస్ 15 వరంగల్, జనగాం, మహబూబాబాద్, రంగారెడ్డిలోని కొన్ని ప్రాంతాలకు కేటాయించారని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+