ఎన్నికల వేళ ఓటర్లకు కీలక అప్డేట్..!!

ఏపీలో ఎన్నికల పోరు హోరా హోరీగా మారుతోంది. పార్టీలే కాదు, ఓటర్లలోనూ ఎన్నికల్లో గెలుపు ఓటమల పైన ఉత్కంఠ కనిపిస్తోంది. ఇదే సమయంలో పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం ప్రయత్నాలు చేస్తోంది. కొత్త ఓటర్ల సంఖ్య ఈ సారి గెలుపు ఓటమలును ప్రభావితం చేయనుంది. కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సారి ఎన్నికల్లో ఓటు వేసే వేయాలనుకొనే వారికి మాత్రం ఓటు నమోదు చేసుకోవటానికి ఈ నెల 15వ తేదీ గడువుగా నిర్ణయించారు.

నమోదు గడువు
కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి మరో నాలుగు రోజుల గడువు మాత్రమే ఉంది. సోమవారంలోగా దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉంటుంది. కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకునేందుకుగాను ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు మరింత సమయం ఇచ్చారు. లోక్ సభ ఎన్నికల తుది జాబితాను మొదట ఫిబ్రవరి 8న ప్రకటించారు. కాని ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు మరింత సమయం ఇచ్చారు అధికారులు. ఫిబ్రవరి 8 నుంచి ఈ నెల 15 వరకు దరఖాస్తు చేసుకున్న వారి పేర్లతో తుది జాబితాను ఈ నెల 25న ప్రకటించనున్నారు.

New voters suggestdto enroll thier vote before15th of this month to include name in voters list

25న ఓటర్ల జాబితా
రాష్ట్రంలో ఏప్రిల్‌ 15 వరకు ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఈలోగా జాబితాలో ఓటు ఉందో .. లేదో పరిశీలించుకుని.. లేని పక్షంలో నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు లేదా ఇప్పటి వరకు ఓటు నమోదు చేసుకోని వారు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం తెలిపింది. ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ ఏటా జనవరి, ఏప్రిల్‌, జులై, అక్టోబరు నెల ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఓటుకు దరఖాస్తు చేసుకోవచ్చునని ఎన్నికల సంఘం ప్రకటించి ఎప్పటికప్పుడు జాబితాలు వెలువరిస్తోంది.2006 మార్చి 31లోగా పుట్టిన వారు తమ పేరును ఓటర్ జాబితాలో నమోదు చేసుకునేందుకు ఫాం -6లో దరఖాస్తు చేసుకోవచ్చు.

New voters suggestdto enroll thier vote before15th of this month to include name in voters list

కీలక సూచన
ఓటరు జాబితాలో పేరు గల్లంతైన వారు ఈ ఫాం 6 ద్వారా మరోసారి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. తాజాగా జాబితాను ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించింది. అందులో పేరు లేనివారు కొత్తగా నమోదు చేసుకోవాలనుకునే వారు ఫారం-8 దరఖాస్తును ఆన్‌లైన్‌లో లేదా నియోజకవర్గ ఎన్నికల అధికారి, సహాయ ఎన్నికల అధికారి లేదా పోలింగ్‌ కేంద్రం అధికారికి ప్రత్యక్షంగానైనా అందజేయవచ్చు. మార్పులు చేర్పులకూ అవకాశం ఉంటుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఓటు నమోదు చేసుకునేందుకు.. https://nvsp.in, https://ceotelangana.nic.in , https://voters.eci.gov.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించాలి సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+