మరీ ఈ రేంజ్‌లోనా: ఏపీలో మరోసారి భారీసంఖ్యలో కరోనా వైరస్ కేసులు: ఇప్పట్లో బ్రేకులు పడనట్టే

అమరావతి: రాష్ట్రంలో మరోసారి కరోనా వైరస్ విజృంభణ ఆరంభమైంది. కొద్దిరోజుల వరకు చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. ఉన్నట్టుండి ఒక్కసారిగా పెరిగాయి. 24 గంటల వ్యవధిలో కొత్తగా 57 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వాటిల్లో అత్యధిక కేసులు చెన్నై కోయంబేడు మార్కెట్, స్వస్థలాలకు తిరిగి వచ్చిన వలస కార్మికులకు చెందినవే కావడం ఆందోళనకు దారి తీస్తోందని అధికారులు చెబుతున్నారు.

కోయంబేడు మార్కెట్‌కు వెళ్లొచ్చిన వారు కాంటాక్టులు ట్రేస్ కావట్లేదని, వలస కార్మికులు మరింత మంది స్వస్థలాలకు చేరుకోవాల్సి ఉన్నందున.. ఇప్పట్లో పాజిటివ్ కేసులకు అడ్డుకట్ట పడకపోవచ్చనే ఆందోళన వ్యక్తమౌతున్నాయి. 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో నెల్లూరు, చిత్తూరు జిల్లాలు టాప్‌లో ఉన్నాయి. ఈ రెండు జిల్లాల్లో 14 చొప్పున కేసులు నమోదు అయ్యాయి. చిత్తూరులో 13, నెల్లూరులో ఎనిమిది కేసులు కోయంబేడు మార్కెట్‌ వల్లే సోకినట్లు అధికారులు నిర్ధారించారు.

Newly 57 Covid-19 Positive cases have reported in Andhra Pradesh last 24 hours

తాజాగా పెరిగిన 57 కేసులతో ఇప్పటిదాకా రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 2157కు చేరింది. ఇందులో 1252 మంది ఇప్పటిదాకా డిశ్చార్జి అయ్యారు. 24 గంటల వ్యవధిలో మొత్తం 60 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని ఇళ్లకు వెళ్లినట్లు అధికారులు తెలిపారు.యాక్టివ్‌గా ఉన్న కేసులు 857. ఇప్పటిదాకా 48 మంది మరణించారు. కొత్తగా నమోదైన కేసుల్లో అనంతపురం-4, తూర్పు గోదావరి-1, కడప-2, కృష్ణా-9, కర్నూలు-8, విశాఖపట్నం-2, విజయనగరం-3 కేసులు ఉన్నాయి. గుంటూరు, ప్రకాశం, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

24 గంటల వ్యవధిలో కోయంబేడు మార్కెట్‌తో లింకులు ఉన్న వారు 28 మంది వెలుగులోకి వచ్చారని అన్నారు. మిగిలిన వారిని ట్రేస్ చేస్తున్నామని చెప్పారు. ఈ 28 మందిలో చిత్తూరు-13, నెల్లూరు-8, కర్నూలు-5 కేసులు ఉండగా.. కడప, అనంతపురం జిల్లాల్లో ఒక్కొక్కరు కరోనా వైరస్ బారిన పడ్డారు కోయంబేడు మార్కెట్‌కు వెళ్లి రావడం వల్ల. ఒకవంక భారీగా డిశ్చార్జిలు నమోదవుతున్నప్పటికీ.. ఏదో ఒక రూపంలో కరోనా వైరస్ రాష్ట్రంలో విస్తరిస్తూనే ఉంది. ఈ సారి కోయంబేడు మార్కెట్ రాష్ట్రంలో కేసులు పెరగడానికి కారణమైందని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+