భార్య ఉరేసుకుంది: షాక్‌తో భర్త కూడా ఆత్మహత్య

గుణశేఖర్ అనే 28 ఏళ్ల వ్యక్తి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఆయన భార్య స్రవంతి (25)ది వేరే కులం. దీంతో ఇరువురి కుటుంబాలకు చెందినవారు కూడా వారి వివాహానికి అంగీకరించలేదు.
పెద్దలను కాదని వారిద్దరు పెళ్లి చేసుకుని పట్టుమని నెల దాటలేదు. వారు ఫూల్‌బాగ్‌లోని ఓ ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నారు. వారి కుటుంబాలు పూర్తిగా సంబంధాలు తెంచుకున్నాయి.
గుణశేఖర్ బుధవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చేసరికి భార్య స్రవంతి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది. అతను షాక్ తిని తాను కూడా ఉరేసుకున్నాడు. స్రవంతి సూసైడ్ నోట్ రాసిపెట్టింది. తాము పెళ్లి చేసుకున్న పరిస్థితులకు తాను తీవ్ర నిరాశకు గురైనట్లు ఆమె అందులో రాసింది.












Click it and Unblock the Notifications