పెళ్లయి 24గంటలు గడవకముందే..: రాజంపేటలో వధువు మిస్సింగ్..

కడప: వివాహమై 24గంటలు కూడా గడవలేదు, వధువు అదృశ్యమైంది. సాయంత్రం వేళ ఇంటి ముందు అటు ఇటు తిరుగుతూ కనిపించిన వధువు.. ఒక్కసారిగా అదృశ్యమవడంతో ఇరు కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. కడప జిల్లా రాజంపేట మండలం అత్తిరాల సమీపంలోని వినాయక్‌నగర్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. వినాయక్‌నగర్‌లో నివసించే రమణమ్మ.. కుమార్తె సునీతకు ఈ నెల 25న వివాహం జరిపించింది. కోడూరుకు చెందిన వెంకటసుబ్బయ్యతో సునీత పెళ్లి జరిగింది. పెళ్లి అనంతరం నవ దంపతులను అదే రోజు సాయంత్రం అత్తిరాలకు తీసుకొచ్చారు.

newly wedded woman missing in rajampeta

రాత్రి సమయంలో ఇంటి బయట అటు ఇటు తిరుగుతూ కనిపించిన సునీత.. ఒక్కసారిగా అదృశ్యమైంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఆమె ఆచూకీ దొరకలేదు. దీంతో ఆదివారం సాయంత్రం మన్నూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సునీత తల్లి రమణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+