ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్
ఆంధ్రుల అన్నగారిగా పేరొందిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు మనుమడు నారా లోకేశ్. నందమూరి బాలకృష్ణకు అల్లుడు. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. చట్టసభల్లో ప్రాతినిథ్యం వహించేందుకు సరైన వయస్సు రాగానే శాసనమండలికి ఎన్నికై తర్వాత మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న లోకేశ్.. నిత్యం వివాదాల్లో చిక్కుకుంటున్నారు.
సీఎం నారా చంద్రబాబు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన లోకేశ్ మున్ముందు రాణించాలంటే మరింత పరిణతి సాధించాలి. లోకేష్ పార్టీ కోసం కొన్నేళ్లు పని చేసి, పార్టీలో తనను తాను నిరూపించుకున్న అనంతరం ఎమ్మెల్సీ అయ్యారు. ఆ తర్వాత ఇటీవల మంత్రివర్గ విస్తరణలో మంత్రి అయ్యారు.

నాారా చంద్రబాబు నాయుడి రాజకీయ వారసుడిగా ఆయన ముందుకు వచ్చారు. చంద్రబాబు తర్వాత నారా లోకేష్ మాత్రమే అనే పేరును సాధించుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐటి కంపెనీలను తేవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. టిడిపి యువనాయకులకు నేతగా ముందుకు వచ్చారు.












Click it and Unblock the Notifications