జనసేన నుంచి డీఎల్ రవీంద్రారెడ్డి పోటీ..! అక్కడే అసలు ట్విస్టు..!!

మాజీ మంత్రి..సీనియర్ పొలిటీషియన్ డీఎల్ రవీంద్రారెడ్డి కొత్త పార్టీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యారు. తాను వచ్చే ఎన్నికల్లో ప్రముఖ పార్టీ నుంచి పోటీ చేస్తానంటూ డీఎల్ స్వయంగా వెల్లడించారు. అధికార - ప్రతిపక్ష పార్టీలు ప్రజా సమస్యలను పట్టించుకోవటం లేదని విమర్శించారు. గత ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గం మొత్తం ఒకటవుదామంటూ చెప్పటంతో తాను వైసీపీకి మద్దతుగా నిలిచానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు డీఎల్ రవీంద్రారెడ్డి తాను ప్రముఖ పార్టీ నుంచి పోటీ చేస్తానని చెప్పటం ద్వారా ఆయన ఏ పార్టీలో చేరుతున్నారనే చర్చ మొదలైంది.

జనసేన వైపు డీఎల్ చూపు

జనసేన వైపు డీఎల్ చూపు

2014 లో టీడీపీకి మద్దతుగా నిలిచిన డీఎల్.. 2019 ఎన్నికల్లో వైసీపీకి మద్దతిచ్చారు. ఇప్పుడు డీఎల్ చేసిన వ్యాఖ్యల్లో భాగంగా.. అధికార - ప్రతిపక్షాల పార్టీల గురించి వ్యాఖ్యలు చేయటంతో వైసీపీ -టీడీపీ కి దూరంగా ఉండాలని ఆయన భావిస్తున్నారనేది స్పష్టం అవుతోంది. వైసీపీ నుంచి డీఎల్ కు టికెట్ దక్కే ఛాన్స్ లేదు. టీడీపీ నుంచి టీటీడీ మాజీ ఛైర్మన్ సుధాకర్ యాదవ్ పోటీగా ఉన్నారు. ఆయనను కాదని.. డీఎల్ కు టీడీపీలో టికెట్ ఇచ్చే అవకాశం లేదు. దీంతో..డీఎల్ జనసేన లేదా బీజేపీలో చేరే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.

సమీకరణాలు అనుకూలిస్తే

సమీకరణాలు అనుకూలిస్తే


ఇదే సమయంలో మైదుకూరు అసెంబ్లీ పరిధిలో సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని వైసీపీ - టీడీపీ లకు అండగా నిలిచే వారి పైన డీఎల్ కు స్పష్టత ఉంది. దీంతో...నియోజకవర్గంలో బలిజ సామాజిక వర్గ ఓట్లను పరిగణ లోకి తీసుకున్న ఆయన..తాను జనసేన నుంచి పోటీ చేయటం ద్వారా కలిసి వస్తుందని విశ్వసిస్తున్నట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే, టీడీపీ - జనసేన పొత్తు వ్యవహారం పై క్లారిటీ కోసం డీఎల్ నిరీక్షిస్తున్నట్లుగా తెలుస్తోంది. పొత్తులో భాగంగా మైదుకూరు సీటు జనసేనకు ఇస్తే తాను జనసేన నుంచి పోటీ చేయటానికి సిద్దంగా ఉన్నట్లుగా డీఎల్ నుంచి సానుకూల సంకేతాలు వెళ్లాయని తెలుస్తోంది.

Recommended Video

    జగన్ ను గద్దె దించాలి అంటే అందరూ కలిసి రావాల్సిందే....*Political | Telugu OneIndia
    పొత్తులు ఉంటే సీటు దక్కేనా

    పొత్తులు ఉంటే సీటు దక్కేనా


    ఇదే సమయంలో పొత్తు లేకపోయినా జనసేన నుంచి పోటీ చేసేందుకు డీఎల్ సిద్దంగా ఉన్నారని చెబుతున్నారు. పొత్తులో భాగంగా టీడీపీ - జనసేన తో బీజేపీ కలుస్తుందా లేదా అనేది పరిగణలోకి తీసుకుంటున్నట్లుగా చర్చ జరుగుతోంది. ఎలాగైనా మైదుకూరు నుంచి జనసేన నుంచే పోటీ చేసేందుకు డీఎల్ ఆసక్తి ఉన్నారని స్థానిక సమాచారం. జనసేన నుంచి చివరి నిమిషంలో సమీకరణాలు సెట్ కాకుంటే బీజేపీ నుంచి అయినా పోటీ చేసేందుకు డీఎల్ సిద్దంగా ఉన్నారని ప్రచారం సాగుతోంది. దీంతో..మైదుకూరులో ఈ సారి డీఎల్ పోటీ చేయటం ఖాయమని తెలుస్తున్నా.. పార్టీ పైనే ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+