జగన్ అరెస్ట్ జరిగేనా, ఢిల్లీ జోక్యంతో - ఊహించని పరిణామాలు..!?

మాజీ సీఎం జగన్ అరెస్ట్ అవుతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఇందుకు ముహూర్తం ఫిక్స్ అయిందని సోషల్ మీడియాలో పోస్టింగ్స్ కనిపిస్తున్నాయి. లిక్కర్ కేసులో ఇప్పటికే తొమ్మిది మందిని అరెస్ట్ చేసారు. అందులో జగన్ కోర్ టీం సభ్యులు ఉన్నారు. జగన్ ఓఎస్డీతో పాటుగా సీఎం గా ఉన్న సమయంలో కార్యదర్శిగా పని చేసిన ధనుంజయ రెడ్డి అరెస్ట్ అయ్యారు. అయితే, జగన్ అరెస్ట్ వార్తల్లో నిజమెంత. ఢిల్లీ నుంచి అమరావతి వరకు ఈ వ్యవహారంలో ఏం జరుగు తోంది. తాజా పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారుతున్నాయి.

జగన్ అరెస్ట్ ప్రచారంతో
ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ అరెస్ట్ కాబోతున్నారంటూ ప్రచారం సాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ లావాదేవీల పైన విచారణకు ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులో సాయిరెడ్డి, మిథున్ రెడ్డి సైతం పలువురు విచారణకు హాజరు అయ్యారు. తాజాగా జగన్ సీఎం గా ఉన్న సమయంలో కీలకంగా వ్యవహరించిన ధనుంజయ రెడ్డి, క్రిష్ణ మోహన్ రెడ్డిని సైతం అరెస్ట్ చేసారు. ఈ కేసులో అరెస్ట్ ల పైన పార్టీ ముఖ్య నేతలతో జగన్ స్పందించారు. అసలు స్కాం లేని చోట.. రాజకీయంగా కుట్రలు చేసి అరెస్ట్ లు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అరెస్ట్ చేస్తే మూడు నెలలు చేయగలుగుతారు..ఆ తరువాత మాత్రం తప్పించు కోలేరని పేర్కొన్నట్లు తెలుస్తోంది. తమ హయాంలో అసలు మద్యం అమ్మకాల్లో అక్రమాలకు అవకాశమే లేదని జగన్ వ్యాఖ్యానించినట్లు సమాచారం.

news-speculating-on-jagan-arrest-in-liquor-case-whats-going-on

సిట్ దూకుడు
మద్యం కేసులో సిట్ విచారణలు - అరెస్ట్ లతో దూకుడుగా వ్యవహరిస్తోంది. సిట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో నమోదు చేసిన నిందితుల్లో జగన్ పేరు లేదు. అయితే, జగన్ పేరు లేకపోయినా అరెస్ట్ చేయకూడదనే నిబంధన లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో జరిగిన నగదు లావా దేవీలకు సంబంధించి ఆధారాలు.. స్టేట్మెంట్స్ కీలకంగా మారుతున్నాయి. అంతిమంగా లబ్ది దారు ఎవరనే కోణంలో ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. పక్కా ఆధారాలు దొరికితే నే జగన్ ను అరెస్ట్ చేస్తారనే వాదన అధికార పార్టీ నేతల నుంచి వినిపిస్తోంది. లిక్కర్ పై సిట్ విచారణ కొనసాగుతున్న సమయంలో వైసీపీ హయాంలో జంగారెడ్డి గూడెంలో జరిగిన లిక్కర్ మరణాల పైన మరో విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.

Take a Poll

రాజకీయ పర్యవసానాలు
జగన్ అరెస్ట్ అయితే రాజకీయంగా చోటు చేసుకునే పర్యవసానాల పైన కూటమి నేతల్లో చర్చ జరుగుతోంది. జగన్ అరెస్ట్ పైన బీజేపీ నాయకత్వంతోనూ సంప్రదించాల్సి ఉంటుందనే వాదన పార్టీ నేతల్లో వినిపిస్తోంది. జగన్ సీఎంగా ఉన్న సమయంలో జరిగిన అరెస్టులు.. స్కిల్ కేసులో చంద్రబాబును జైలుకు పంపటం.. ఆ తరువాత వరుసగా నమోదు చేసిన కేసులతో ప్రజల్లో వచ్చిన అభిప్రాయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు జగన్ ను అరెస్ట్ చేస్తే రాజకీయ ప్రతీకార చర్యగా భావించే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. దీంతో, పూర్తి ఆధారాలు సేకరించిన తరువాతనే తుది నిర్ణయం ఉంటుందని భావిస్తున్నారు. అదే విధంగా జగన్ అరెస్ట్ విషయంలో బీజేపీ అధినాయకత్వం మూడ్ కీలకంగా మారుతోంది. పూర్తి ఆధారాలు ఢిల్లీ నేతలకు ఇప్పటికే పంపారని చెబుతున్నారు. కాగా, జగన్ అరెస్ట్ విషయంలో రాజకీయంగా తుది నిర్ణయం జరగలేద నేది అర్దం అవుతోంది. దీంతో.. రానున్న రోజుల్లో జగన్ విషయంలో తీసుకునే నిర్ణయాలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారటం ఖాయంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+