ఏపీలో మరో 48 గంటల్లో భారీ వర్షాలు: ఉరుములు, మెరుపులతో వానలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు భారీ వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. నైరుతి ఋతుపవనాల ఉత్తర పరిమితి బార్మర్, భిల్వారా, ధోల్పూర్, అలీఘడ్, మీరట్, అంబాలా, అమృతసర్ గుండా వెళుతుందని పేర్కొంది. దక్షిణ ఒడిశా & పరిసరాలపై ఇతర ఉపరితల ఆవర్తనము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తీరప్రాంత పరిసరాలు, సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందని తెలిపింది.
ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ, వాయువ్య దిశల నుండి గాలులు వీస్తున్నాయని తెలిపింది. ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం : ఈరోజు, ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులు తోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది.

మంగళవారం ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులు తోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మంగళవారం బుధవారం దక్షిణ కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది.
మంగళ, బుధవారాల్లో రాయలసీమలో ఉరుములు, మెరుపులు తోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించింది వాతావరణ శాఖ.












Click it and Unblock the Notifications