పోలవరం: ఏపీ సర్కారుకు ఎన్జీటీ భారీ జరిమానా: టీడీపీ నేతల ట్రోల్స్‌కు మంత్రి అనిల్ కౌంటర్
న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారంటూ జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ జరిమానా విధించింది. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం గుర్తించిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారని ఏపీ ప్రభుత్వానికి రూ. 120 కోట్ల జరిమానా విధించింది.

పోలవరంతోపాటు 3 ప్రాజెక్టులకు ఎన్జీజీ జరిమానా
పర్యవరణ అనుమతులు లేకుండా కట్టిన మరో మూడు ప్రాజెక్టులకు కూడా జరిమానా విధించింది ఎన్జీటీ. పురుషోత్తపట్నం ప్రాజెక్టుకు సంబంధించి రూ. 24.56 కోట్లు, పట్టిసీమ ప్రాజెక్టుకు సంబంధించి రూ. 24.90 కోట్లు, చింతలపూడి ప్రాజెక్టుకు సంబంధించి రూ. 73.6 కోట్లు జరిమానా విధించింది. జరిమానాను మూడు నెలల్లో చెల్లించాలని రాష్ట్రానికి ఎన్జీటీ ఆదేశించింది. ఏపీ కాలుష్య నియంత్రణ మండలికి జరిమానా చెల్లించాలని ఆదేశాల్లో పేర్కొంది. జరిమానా నిధులు వినియోగంపై ఏపీ పీసీబీ, సీపీసీబీ సభ్యులతో కమిటీ నియమించాలని ఎన్జీటీ ఆదేశించింది. పర్యావరణ అనుమతుల ఉల్లంఘనలపై గతంలో ఎన్జీటీకి ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు పెంటపాటి పుల్లారావు, వట్టి వసంతకుమార్ ఎన్జీటీకి ఫిర్యాదులు చేశారు.

కొనసాగుతున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు
కాగా, ఇ్పపటికే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం వేగవంతంగా పనులను చేపడుతుంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే అటు ఉత్తరాంధ్రతోపాటు ఉభయ గోదావరి జిల్లాలలకు తాగునీటి కష్టాలు తీరుతాయి. విశాఖపట్నం మహానగరానికి కూడా తాగునీరు అందించే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నారు. కేవలం తాగు, సాగు నీరుతో పాటు చేపల పెంపకానికి, జలరవాణాకు ఈ ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంది. అంతేగాక, మిగులు జలాలను నదుల అనుసంధానంలో భాగంగా కృష్ణా నదితో కలిపే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కేంద్రం పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల నిధులు విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం కోరుతుంది. పార్లమెంటు సమావేశాల్లోనూ ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తున్నారు.
Recommended Video

పోలవరం నిర్మాణంపై టీడీపీ ట్రోల్స్.. మంత్రి అనిల్ స్ట్రాంగ్ కౌంటర్
ఇది ఇలావుండగా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై టీడీపీ నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఏడాదిలోగా ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారని నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌పై మండిపడ్డాడు. దీంతో మంత్రి అనిల్ కూడా టీడీపీ నేతలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. పోలవరంపై టీడీపీ నేతలు చేస్తున్న ట్రోల్స్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2018లో పోలవరం నుంచి నీటిని విడుదల చేస్తామని చెప్పిన దేవినేని ఉమా చేతులెత్తేశాడని, అతనిపై ఎందుకు ట్రోల్ చెయ్యరని ప్రశ్నించారు. పోలవరం ఎందుకు ఆలస్యం అయ్యిందో మీకు తెలియదా అని టీడీపీ నేతలను ప్రశ్నించారు. డయా ఫ్రమ్ వాల్, కాంక్రీట్ వాల్ నాణ్యత లోపం వాస్తవం కాదా అని నిలదీశారు. పోలవరంపై నెటిజన్లు ఎవరూ ట్రోల్ చేయడం లేదని, అంతా టీడీపీ నేతలే చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలకు నిజాలు చెప్పే ధైర్యం లేదని, దమ్ముంటే వాస్తవాలు ట్రోల్ చేయాలని మంత్రి అనిల్ సవాల్ విసిరారు. టీడీపీ చెంచా మీడియా అసత్య కథనాలు జనం నమ్మరని స్పష్టం చేశారు. కుల గజ్జితో పసుపు మీడియా తప్పుడు రాతలు రాస్తోందని మండిపడ్డారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications