తెలుగు రాష్ట్రాల్లో ఈ టోల్ ప్లాజాల్లో ఫీజుల తగ్గింపు - కొత్త ధరలు, వీటికే వర్తింపు..!!
టోల్ ప్లాజా ఫీజుల్లో తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు ఊరట లభించింది. పలు టోల్ ప్లాజాల్లో ఫీజు లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కోల్ కతా - చెన్నై హైవే పై గుంటూరు జిల్లా ఖాజా వద్ద ఉన్న టోల్ ప్లాజాలో ఈ అర్ద్రరాత్రి నుంచి ఫీజులు తగ్గనున్నాయి. కాజా నుంచి చిన్నవుట్ పల్లి వరకు నిర్మించిన బైపాస్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావటంతో ఈ టోల్ ప్లాజాలో ఫీజులు తగ్గిస్తున్నారు. ఈ మేరకు తాజా NHAI అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
టోల్ ప్లాజా ఫీజుల విషయంలో తాజాగా తీసుకున్న నిర్ణయం తెలుగు రాష్ట్రాల ప్రజలకు వెసులు బాటుగా మారనుంది. కాజా నుంచి పెదవుట్ పల్లి బైపాస్ పూర్తిగా అందుబాటులోకి వచ్చింది. దీంతో, కాజా టోల్ ప్లాజా ఫీజు తగ్గించారు. బైపాస్ లో వెంకటపాలెం వద్ద ఉన్న టోల్ ప్లాజాకు కాజా టోల్ ప్లాజాకు మధ్య దూరం 15 కిలో మీటర్లు మాత్రమే ఉంది. అదే విధంగా గుంటూరు - ఏలూరు మధ్య రాకపోకలు సాగించే వాహనాలు బైపాస్ లో వెళ్తున్నాయి. అయితే, గుంటూరు - విజయవాడ మధ్య రాకపోకలు సాగించే వాహనాలు కాజా టోల్ ప్లాజా దాటిన తరువాత తాడేపల్లి, వారధి మీదుగా వాహనాలు వెళ్తాయి. ఇందులో కాజా టోల్ ప్లాజా దాటాక మంగళగిరి, తాడేపల్లి, వారధి ఈ మార్గం మొత్తం ఇక పై NH పరిధిలోకి రాదు. దీంతో.. ఈ మార్గంలో టోల్ పనులు చేయకూడదు. వీటిని పరిగణలోకి తీసుకొని కాజా టోల్ ప్లాజాలో ఫీజులు తగ్గిస్తున్నారు.

కమర్షియల్ కారుకు ప్రస్తుతం రూ 170 ఉండగా.. ఇక పైన రూ 120 వసూలు చేస్తారు. ఇతర వాహనాల ఫీజులు కూడా తగ్గిస్తున్నారు. అటు ఏలూరు వైపు ఉన్న పొట్టిపాడు టోల్ ప్లాజాలో ఈ రోజు అర్ద్రరాత్రి నుంచి టోల్ వసూళ్లు శాశ్వతంగా నిలపివేయనున్నారు. దాని తరువాత కలపర్రు టోల్ ప్లాజా మాత్రమే కొనసాగుతుంది. ఇక పై గుంటూరు - ఏలూరు మధ్య కాజా, వెంకటపాలెం, వెదురుపావులూరు, కలపర్రు టోల్ ప్లాజాలు కొనసాగుతాయి. అదే విధంగా హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవే 65పై టోల్ రుసుములు స్వల్పంగా తగ్గనున్నాయి. ఏప్రిల్ ఒకటి నుంచి (మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి) ఈ కొత్త రుసుములు అమల్లోకి వస్తాయని అధికారులు తెలిపారు. వివిధ రకాల వాహనాలకు రూ.5 చొప్పున తగ్గించారు. పంతంగి టోల్‌ప్లాజా దగ్గర టోల్ ఫీజుల విషయానికి వస్తే.. 3 యాక్సిల్ కమర్షియల్ వాహనాలకు రూ.5 చొప్పున ఫీజు తగ్గించారు. 24 గంటల్లో ఇరువైపులా ప్రయాణానికి 435 నుంచి 430కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.












Click it and Unblock the Notifications