వనజాక్షిపై చింతమనేని దాడి: ఏపీ ప్రభుత్వానికి హెచ్చార్సీ నోటీసులు
హైదరాబాద్: కృష్ణా జిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షి పైన దాడి ఘటన మీద జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎన్‌హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. వనజాక్షఇ దాడి ఘటన మీద రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి, డిజిపిలకు నోటీసులు ఇచ్చింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ కేసును సుమోటోగా తీసుకుంది.

కాగా, కృష్ణా జిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షి పైన పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఇది కలకలం రేపింది. రెవెన్యూ సంఘాలు వనజాక్షికి అండగా నిలిచాయి.
దీనిపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రెవెన్యూ సంఘాలతో చర్చించారు. వనజాక్షి పైన దాడికి పాల్పడిన చింతమనేని ప్రభాకర్ అనుచరుల పైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనికి ఓ కమిటీ వేస్తామని చెప్పారు. ఈ విషయమై విచారణ సాగుతోంది.












Click it and Unblock the Notifications