వివాదాస్పద వ్యాఖ్యలు: మంత్రి ఆదిపై ఫిర్యాదును స్వీకరించిన ఎన్‌హెచ్ఆర్సీ
రాష్ట్ర మంత్రి ఆదినారాయణరెడ్డిపై అందిన ఫిర్యాదును జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణకు స్వీకరించింది. దళితులను కించపర్చేలా వ్యాఖ్యలు చేశారంటూ ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు అందింది.
న్యూఢిల్లీ: దళితులను కించపర్చేలా వ్యాఖ్యలు చేశారంటూ రాష్ట్ర మంత్రి ఆదినారాయణరెడ్డిపై అందిన ఫిర్యాదును జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణకు స్వీకరించింది. దళితులు శుభ్రంగా ఉండరని, వాళ్లు చదువుకోరంటూ ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యానించారని ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ సభ్యుడు బోరుగడ్డ అనిల్ కుమార్ ఆరోపించారు.
ఈ మేరకు ఎన్‌హెచ్ఆర్సీలో ఆయన ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కమిషన్ కేసును విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడారు.

తాను చేసిన ఫిర్యాదును జాతీయ మానవ హక్కుల కమిషన్ స్వీకరించిందని చెప్పారు. మంత్రి వ్యాఖ్యలపై విచారణ జరిపి చర్యలు తీసుకోనుందని అనిల్ కుమార్ తెలిపారు.












Click it and Unblock the Notifications