ఏ1 అంటూ జగన్‌ను హేళన చేసిన మెగా డాటర్

ఎన్నికల వేళ మెగా డాటర్ నిహారిక చేసిన పని ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నిహారిక నిర్మాతగా మారి కమిటీ కుర్రాళ్లు అంటూ ఓ సినిమా తెరకెక్కించింది. తాజాగా ఈ సినిమాలోని పాటను విడుదల చేశారు. ఈ సాంగ్‌ వైసీపీకి సెటైరికల్‌గా తెరకెక్కించారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తాగి బండి నడపటం ఎంత ప్రమాదమో.. తాగి ఓటు వేయడం అనేది అంత కన్నా పెద్ద ప్రమాదని ఈ సాంగ్‌లో చూపించారు.

ఎన్నికల సమయంలో మందు ఎవరు పోస్తున్నారని పోలిస్ అడగ్గా.. అక్కడ ఏ1 పంచుతున్నాడు కదా అని చెప్పడం ఈ వీడియో సాంగ్‌లో చూపించారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ ఏ1గా ఉన్నారు. దీంతో జగన్‌ను ఉద్దేశించి ఏ1 అనే పదాన్ని ఈ పాటలో పెట్టారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. పైగా నిహారికనే ఈ పాట పడటంతో ఇది మరింత వివాదంగా మారేలా కనిపిస్తోంది. పవన్ కల్యాణ్‌కు మద్దతు కోసం నిహారిక ఇలా ఎన్నికల ముందు ఈ పాటను విడుదల చేసిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

niharika SATIRICAL song release against cm jagan

మరోవైపు ఈ పాటపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జగన్‌ను విమర్శించే అర్హత మెగా ఫ్యామిలీకి లేదని వారు చెబుతున్నారు. మరికొంతమంది నిహారిక వ్యక్తిగత జీవితంపై కామెంట్స్ చేయడం గమనర్హం. ప్రజాక్షేత్రంలో జగన్‌ను ఎదుర్కొనలేకనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే పిఠాపురంలో పోటీ చేస్తున్న పవన్ కల్యాణ్ గెలుపు కోసం జబర్థస్త్ నటులు , మెగా హీరోలు వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ,నాగబాబు ,ఆయన భార్య విసృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+