ఈ ఏడాది ఇతనే హైలెట్ ''మీకు రూ 15,000, మీకు 15,000'' అంటూ రచ్చ
2024వ సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. ఇంకా కొన్ని రోజుల్లో 2025 మొదలుకాబోతుంది. ఈ సమయంలో 2024లో చాలానే మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి. అనేక రకాల సంఘటనలు ఈ 2024లో చోటు చేసుకున్నాయి. పార్లమెంట్ ఎన్నికల నుంచి ఒలింపిక్స్ వరకు, ఐపీఎల్ నుంచి వరల్డ్ కప్ వరకు ఇలా అనేక రకాల సంఘటనలు ఈ 2024లో చోటు చేసుకున్నాయి. అలాగే ఎంతో మంది ఈ సంవత్సరం సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. అలా వైరల్ అయిన వారిలో ఓ వ్యక్తి ప్రత్యేకంగా నిలిచారు.
ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా వినాయక చవితి సంబరాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి.ముఖ్యంగా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమాన్ని చూడటానికి రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు తరలి రావడం జరిగింది. ఎటువంటి అటంకాలు లేకుండా గణేష్ నిమజ్జనాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో పూర్తయ్యాయి. అయితే వినాయక చవితికి ముందు విజయవాడను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. దీంతో అక్కడ కొంత ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినప్పటికి అక్కడ కూడా వినాయక చవితి సంబరాలు ఘనంగానే నిర్వహించారు. ఆటపాటలతో యూత్ సందడి చేశారు.

ముఖ్యంగా డీజేలతో యువత చిందులు వేశారు.అయితే ఈ ఏడాది వినాయక చవితి సెలబ్రేషన్స్‌లో వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్‌కు సంబంధించిన పాటలతో అభిమానులు హల్ చల్ చేశారు. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయినప్పటికి ఏమాత్రం అధికార పార్టీకి తగ్గకుండా ఆ పార్టీ క్యాడర్ సంబరాలు చేసుకోవడం కనిపించింది. చాలా చోట్ల వినాయకుడు ఊరేగింపు సమయంలో జగన్ పాటలకు అభిమానులు డ్యాన్స్ వేయడం కనిపించింది. తెలంగాణలో కూడా జగన్ పాటలకు అభిమానులు చిందులు వేస్తూ కనిపించారు. ఇదే సమయంలో సమయంలో కూటమి ప్రభుత్వానికి సెటైర్‌గా కూడా కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు చెప్పిన మాటలను వైసీపీ శ్రేణులు తెగ ట్రోల్ చేశారు.
గణేష్ నిమజ్జనాల్లో ఈ ఏడాది ఇదే హైలెట్ ''మీకు రూ 15,000 ''#YSRCP #GaneshImmersion #GaneshImmersion2024 #ViralVideo #APPolitics #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/voiP5ZCer1
— oneindiatelugu (@oneindiatelugu) September 18, 2024
ఎన్నికల ప్రచారంలో భాగంగా నిమ్మల రామానాయుడు ప్రజల దగ్గర వెళ్లి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్కూలుకు వెళ్లే ప్రతి పాప, బాబుకు సంవత్సరానికి రూ.15,000 ఇస్తామని చెబుతారు. ఎంతమంది ఉంటే అంతమందికి రూ.15,000 ఇస్తామని ఆయన చెబుతారు. ప్రతి మహిళకు ఏడాదికి రూ.18,000 ఇస్తామని ఆయన హామీ ఇస్తారు. దీనికి సంబంధించిన హామీ పత్రాన్ని కూడా నిమ్మల రామానాయుడు ప్రజలకు అందజేస్తారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీలు కాకపోవడంతో వైసీపీ శ్రేణులు ఈ విధంగా కూటమి ప్రభుత్వానికి సెటైర్స్ వేస్తూ వీడియోలు చేయడం జరిగింది. ఈ ఏడాది వైరల్ అయిన వీడియోల్లో ఇది అందర్ని ఆకట్టుకుంది.












Click it and Unblock the Notifications