విభజన: కిరణ్ వైపు తొమ్మిది, అధిష్టానంవైపు 10మంది!

ముఖ్యంగా కాంగ్రెస్ మంత్రులు, ప్రజాప్రతినిధులు అవలంభిస్తున్న వ్యవహారం చర్చనీయాంశమౌతోంది. సీమాంధ్ర మంత్రులు అంతా సమైక్యవాదాన్ని వినిపిస్తున్నప్పటికీ, అధిష్ఠానవాదులు, సమైక్యాంధ్ర వాదులుగా సీమాంధ్ర కేబినెట్ విడిపోయింది. సీమాంధ్రకు చెందిన 21 మంది మంత్రుల విధానాన్ని పరిశీలిస్తే సమైక్యవాదం కోరుకుంటూనే హైకమాండ్ మాటే శిరోధార్యమంటున్న వారిలో బొత్స సత్యనారాయణ, కొండ్రు మురళీ, పసుపులేటి బాలరాజు, మాణిక్య వరప్రసాద రావు, వట్టి వసంత కుమార్, కన్నా లక్ష్మీ నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, సి రామచంద్రయ్య, రఘువీరా రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.
అలాగే పూర్తి సమైక్యవాదాన్ని వినిపిస్తున్న మంత్రులుగా గంటా శ్రీనివాస రావు, పితాని సత్యనారాయణ, పార్థసారథి, కాసు వెంకట కృష్ణా రెడ్డి, శైజలానాథ్, టిజి వెంకటేశ్, ఏరాసు ప్రతాప రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఇక మహీధర్ రెడ్డి, అహ్మదుల్లాలు ఏటూ తేల్చుకోలేక పోతున్నారట.
మంత్రుల్లో దాదాపు సగం మంది అధిష్టానం మాటకు కట్టుబడి ఉండే అవకాశముండగా, కిరణ్‌కు తొమ్మిది మంది వరకు ఉండనున్నారు. ఇది సిఎంకు కొంత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందంటున్నారు. దీని ప్రభావం శాసన సభకు వచ్చే బిల్లు పైనా ఉంటుందన్నారు. అయితే బిల్లు సభకు వస్తే విభజనకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని బొత్స వంటి నేతలు చెబుతున్నప్పటికీ ఆఖరుకు వారు అధిష్టానం మాట వినే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఇప్పుడు వెంట ఉన్న వారిలో కొందరు చివరి దశలో మనసు మార్చుకుంటే కిరణ్ పరిస్థితి ఏమిటనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది.












Click it and Unblock the Notifications