నిర్మలా సీతారామన్ అల్లుడు ఏం చేస్తారో తెలుసా?
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Niramala Sitharaman), పరకాల ప్రభాకర్ దంపతుల కుమార్తె వాజ్ఞ్మయి(Vangmayi) వివాహం ప్రతీక్(Pratik Doshi)తో నిరాడంబరంగా జరిగింది. స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో బెంగళూరులోని మంత్రి ఇంట్లోనే పెళ్లి వేడుక పూర్తిచేశారు.
రాజకీయ ప్రముఖులు, వీవీఐపీలు ఎవరూ హాజరుకాలేదు. పెళ్లి సమాచారాన్ని సీతారామన్ కుటుంబసభ్యులు అధికారికంగా బయటకి వెల్లడించలేదు. అయితే వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నిర్మలా సీతారామన్ అల్లుడు ప్రతీక్ వివరాల కోసం నెటిజన్లు గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. ప్రతీక్ ఎవరో? ఏం చేస్తుంటారో తెలుసుకుందాం.
ప్రధానమంత్రి నరేంద్రమోడీకి అత్యంత సన్నిహితుడు. పీఎంవోలో కీలక వ్యక్తిగా విధులు నిర్వహిస్తున్నారు. 2014 నుంచి పీఎంవోతో అనుబంధం కొనసాగుతోంది. 2019 జూన్ లో జాయింట్ సెక్రటరీ ర్యాంకులో (రీసెర్చి& స్ట్రాటజీ)గా నియమితులయ్యారు. ప్రధానమంత్రికి కళ్లు, చెవులూ తానై ప్రతీక్ వ్యవహరిస్తారు. జాతీయ పత్రికలు సైతం ప్రతీక్‌తో ఇలాగే వ్యవహరిస్తాయి. సింగపూర్ మేనేజ్‌మెంట్ స్కూల్‌లో ఎంబీఏ చేశారు. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీఎంవోలో రీసెర్చ్ అసిస్టెంట్‌గా పనిచేశారు. ప్రచారానికి దూరంగా ఉంటారు. సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉండరు.

నిర్మలా సీతారామన్ కుమార్తె పరకాల వాజ్ఞ్మయి కాలమిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఇంగ్లిష్ లిటరేచర్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత అమెరికాలోని మాసాచూసాట్స్‌లోని బోస్టన్‌లో నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీలోని మిడిల్ స్కూల్ ఆఫ్ జర్నలిజం నుంచి డిగ్రీ అందుకున్నారు. ప్రముఖ వార్తా సంస్థకు ఫీచర్ రైటర్‌గా పనిచేస్తున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications