విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టానికి ప్రధాన కారణాలివే, ప్రైవేటీకరణ అందుకే: వైసీపీ ఎంపీకి నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరసనలు కొనసాగుతున్నప్పటికీ.. ఈ విషయంలో కేంద్రం మాత్రం వెనక్కి తగ్డం లేదు. వందశాతం కేంద్ర ప్రభుత్వ సంస్థ కావడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెబుతోంది. ప్రైవేటీకరణ తప్పదని మరోసారి స్పష్టం చేసింది.

లాభనష్టాలు కొలమానం కాదు..

లాభనష్టాలు కొలమానం కాదు..

తాజాగా, లోక్‌సభలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బాలశౌరి అడిగిన ప్రశ్నకు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ప్రైవేటీకరణకు లాభనష్టాలు కొలమానం కాదని అన్నారు. ప్రవైటీకరణ ద్వారా సమకూరిన వనరులను వివిధ సామాజిక, అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించడమే ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలకు ప్రధాన కారణాలివే..

విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలకు ప్రధాన కారణాలివే..

విశాఖ ఉక్కు పరిశ్రమ నష్టాలకు ప్రత్యక్ష, పరోక్ష వ్యయాలు, అప్పులపై అధిక వడ్డీలు, తక్కువ ఉత్పాదకత, వినియోగా సామర్థ్యమే ప్రధాన కారణమని నిర్మలా సీతారామన్ వివరించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను దృష్టిలో ఉంచుకుని 100 శాతం వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ చేపట్టినట్లు తెలిపారు.

టార్గెట్ 1.75 లక్షల కోట్ల ఆదాయం

టార్గెట్ 1.75 లక్షల కోట్ల ఆదాయం

ఈ బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వరంగ పరిశ్రమలు, ఆర్థిక సంస్థల్లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ, మైనార్టీ వాటాల విక్రయం ద్వారా 2021-22లో 1.75 లక్షల కోట్ల ఆదాయం ఆర్జించాలని ప్రతిపాదించినట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రభుత్వరంగ సంస్థల ఆస్తుల ఉత్పాదకతను పెంచి వాటి ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చడమే తమ ప్రధాన ఉద్దేశమని వివరించారు.

ప్రైవేటు మూలధనం, టెక్నాలజీ, ఇన్నోవేషన్, అత్యుత్తమ యాజమాన్య పద్ధతులను ప్రవేశపెట్టడం ద్వారా ఉత్పాదకతను పెంచుతామని కేంద్రమంత్రి తెలిపారు.

ప్రజల కోసమేనంటూ నిర్మలా సీతారామన్..

ప్రజల కోసమేనంటూ నిర్మలా సీతారామన్..

ప్రైవేటీకరణతో వచ్చే వనరులను వివిధ సామాజిక, అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించడం వల్ల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. కాగా, ఏపీ ప్రభుత్వానికి విశాఖ స్టీల్ ప్లాంట్ దక్కించుకోవాలనే ఆలోచన ఉంటే కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని ఇప్పటికే మరో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపిన విషయం తెలిసిందే. ఇక ఏపీ ప్రభుత్వం కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం కానివ్వకుండా తామే దక్కించుకోవాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+