ఇది... వెరీ వెరీ వెరీ స్పెషల్ ట్రైన్

భారతీయులకు, రైల్వేకు విడదీయరాని అనుబంధం ఉంది. ప్రజల దైనందిన జీవితాల్లో ఇవి కూడా ఒక భాగమయ్యాయి. సాధారణం మనం రైలు ప్రయాణం చేసేటప్పుడు రెండువైపులా తలుపులు, రెండువైపులా కిటికీలు ఉండటం చూస్తాం. అయితే బోగీకి కిటికీలు లేని రైలును చూశారా? బహుశా ఇలాంటి రైలును మీరు చూసివుండరు. దాన్ని గురించి తెలుసుకుందాం.

బోగీలకు రెండువైపులా కిటికీలు లేనివాటిని NMG రైళ్లు అంటారు. మనం ప్రయాణం చేసే రైళ్లల్లో ఉండే బోగీలన్నింటికీ ఒక కాలపరిమితి ఉంటుంది. తర్వాత వాటిని తొలగిస్తారు. ఏ బోగీకైనా దాని జీవితకాలం 25 సంవత్సరాలు. మరమ్మతులద్వారా 5 నుంచి 10 సంవత్సరాలకు ఉపయోగపడేలా చేస్తారు. 25 సంవత్సరాలవగానే ఆ బోగీని సర్వీసు నుంచి తొలగిస్తారు. NMG రేక్ పేరుతో ఆటో క్యారియర్‌గా ఉపయోగిస్తుంటారు.

train11

NMG అంటే కొత్తగా సవరించిన గూడ్స్ అని అర్థం. ఈ బోగీలకు ఉండే తలుపులు, కిటికీలు అన్నింటినీ మూసేస్తారు. కార్లు, మినీ ట్రక్కులు, ట్రక్టర్లను సులువుగా లోడింగ్, అప్ లోడింగ్ చేసుకోవడానికి ఉపయోగపడేలా వీటిని సిద్ధం చేస్తారు. వీటిని ఉపయోగిస్తారు. సీట్లు, ఫ్యాన్లు, లైట్లు కూడా తీసేస్తారు. దీనివల్ల సాధారణ కోచ్ కాస్తా NMG కోచ్‌గా మారిపోతుంది. బోగీ మరింత ధృఢంగా ఉండేందుకు ఇనుముతో వెల్డిండ్ చేస్తారు. కోచ్ వెనుక భాగంలో ఒక తలుపును అమర్చి లగేజీని లోడ్ చేయడానికి, అన్ లోడ్ చేయడానికి ఈ తులపును ఉపయోగిస్తారు.

ప్రస్తుతం భారతీయ రైల్వే సరుకులు రవాణా చేసే గూడ్స్ రైళ్లకే మొదటి ప్రాధాన్యం ఇస్తోంది. గతంలో గూడ్స్ రైళ్లను నిలిపి ప్రయాణికుల రైళ్లను ముందు పంపేవారు. అయితే సరుకు రవాణా వల్లే ఎక్కువ ఆదాయం వస్తుండటంతో సకాలంలో వాటిని గమ్యానికి చేర్చడం కోసం గూడ్స్ కు ప్రాధాన్యతనిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+